Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు అప్పు ఇచ్చింది మేం కాదు: అమిత్ షా

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన బడాబాబుల ఆస్తుల జప్తుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లును మార్చి 12నే లోక్‌‌సభలో ప్రవేశపెట్టినా ఉభయసభల ప్రతిష్టం

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు అప్పు ఇచ్చింది మేం కాదు: అమిత్ షా
, ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (15:28 IST)
ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన బడాబాబుల ఆస్తుల జప్తుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లును మార్చి 12నే లోక్‌‌సభలో ప్రవేశపెట్టినా ఉభయసభల ప్రతిష్టంభన కారణంగా ఆమోదం పొందలేదు. 
 
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్ధిక నేరగాళ్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌‌కు ఆమోద ముద్ర పడింది. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు యూపీఏ హయాంలోనే రుణాలు ఇచ్చారని... ఆ అంశంతో బీజేపీ నేతలెవరికీ సంబంధం లేదన్నారు. 
 
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలన్నీ కూటమిలో కొనసాగుతాయని, కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయని తెలిపారు. గత నాలుగేళ్ల మోదీ పాలనలో కుంభకోణాలు చోటు చేసుకోలేదని, బీజేపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదని అమిత్ షా చెప్పారు. 
 
21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, దీనికి తమ విధానాలు, పనితీరే కారణమని తెలిపారు. అట్టడుగుస్థాయికి పాలనను తీసుకెళ్లడమే తమ విజయమని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్‌ను కొత్త బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాల్సిందే: ఆర్బీఐ