ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో అభివృద్ధి చెందుతున్న విభాగాలలో అభ్యాసం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోన్న లాభాపేక్ష లేని నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) అత్యంత ప్రతిష్టాత్మకమైన వాటర్ సస్టెయిబిలిటీ అవార్డు 2021-2022ను అందుకుంది. ఈ అవార్డును యుఎన్‌డీపీ సహకారంతో టెరి ఏర్పాటుచేసింది. వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఈ అవార్డును యూనివర్శిటీ తరపున మేజర్ జనరల్ ఏకె సింగ్, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్- డీన్ (స్టూడెంట్ ఎఫైర్స్)- గుర్విందర్ సింగ్, హెడ్ ఫ్యాకల్టీ అండ్ ప్రాజెక్ట్, నిట్ యూనివర్శిటీ అందుకున్నారు.
ఈ సందర్బంగా నిట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ఛైర్మన్ విజయ్ కె థడానీ మాట్లాడుతూ, ఇది మా అందరికీ గర్వకారణమైన క్షణం. యుఎన్‌డీపీతో కలిసి ఈ గుర్తింపును అందించిన టెరికి ధన్యవాదములు చెబుతున్నాను. ప్రకృతి ఒడిలో నిట్ యూనివర్శిటీని నిర్మించాము. ప్రారంభం నుంచి మేము పర్యావరణం దృష్టిలో పెట్టుకుని సస్టెయినబల్ మోడల్స్‌ను మా నీటి వినియోగం, ఇతర గ్రీన్ కార్యకలాపాలలో వినియోగిస్తున్నాము. ఉన్నత విద్యా సంస్థగా, ఎన్‌యు కేవలం విద్యా శిక్షణ మాత్రమే కాదు, సస్టెయినబల్ లివింగగ్ పట్ల కూడా మా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.