Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్య‌, వైద్యం, పౌష్టికాహారం అంశాల్లో మెరుగైన ప్ర‌గ‌తి : సిఎస్‌లతో ప్ర‌ధాని

విద్య‌, వైద్యం, పౌష్టికాహారం అంశాల్లో మెరుగైన ప్ర‌గ‌తి : సిఎస్‌లతో ప్ర‌ధాని
, బుధవారం, 6 నవంబరు 2019 (21:06 IST)
విద్య‌, వైద్యం, పౌష్టికాహారం అంశాల్లో మెరుగైన ప్ర‌గ‌తిని సాధించాల‌ని, ఆ దిశ‌గా వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్షించుకుంటూ మెరుగైన ప్ర‌గ‌తిని సాధించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది అన్నారు.

దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి కార్యక్రమంపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం (వీసి) ద్వారా ప్రగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రగతి, విద్యుత్ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించి మెరుగైన స్థితిలో ఉన్న 8 రాష్ట్రాల్లో క్రియేషన్ ఆఫ్ ఇంట్రా స్టేట్ ట్రాన్సుఫర్మేషన్ సిస్టమ్, ట్రాన్స్ మిషన్ సిస్టమ్ పటిష్టీకరణ, ట్రాన్స్ ఫార్మేషన్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్టిక్ట్ ప్రోగ్రామ్, వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమం, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంశాలపై ప్రధాని సిఎస్ లతో సమీక్షించారు.

ముఖ్యంగా యాస్పిరేషనల్ జిల్లాలకు సంబంధించి విద్య, వైద్యం, పౌష్టికాహారం తదితర అంశాలకు చెందిన వివిధ ఇండికేటర్లలో మెరుగైన ప్రగతి సాధించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆయా జిల్లాల కలక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు.

యాస్పిరేషనల్ జిల్లాలకు సంబంధించి యువ అధికారులను నియమించి వివిధ పథకాలు, ప్రాజెక్టులు వేగవంతంగా జరిగి ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందేలా చూడాలని చెప్పారు. వెనుకబడిన బ్లాకులను గుర్తించి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ లను ప్రధాని ఆదేశించారు.

అంతేగాక వివిధ పథకాలు కార్యక్రమాలు అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు మరింత సమన్వయంతో పనిచేసి సకాలంలో వాటిని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా చర్యల తీసుకోవాలని సిఎస్ లను ప్రధాని నరేంద్ర మోడి ఆదేశించారు.

వీడియో సమావేశంలో ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి, ఇంధన, సర్వీసుల శాఖల కార్యదర్శులు ఎన్.శ్రీకాంత్, శశిభూషణ్ కుమార్, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబువి దొంగ దీక్షలు.. పవన్‌కల్యాణ్‌ది పిచ్చివాగుడు