Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీకి శిక్ష జడ్జికి పదోన్నతి.. అడ్డుకున్న సుప్రీం కోర్టు

Advertiesment
supreme court
, శనివారం, 13 మే 2023 (10:28 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ హస్‌ముఖ్ భాయ్ వర్మ పదోన్నతిని సుప్రీం కోర్టు అడ్డుకుంది. 
 
ఆయనతో సహా 68 మంది దిగువ కోర్టు న్యాయమూర్తులను జిల్లా జడ్జీలుగా నియమిస్తూ గుజరాత్ సర్కారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి సీనియారిటీ కమ్ మెరిట్ ప్రాతిపదికన 68 మందికి పదోన్నతలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
గుజరాత్ స్టేట్ జుడీషియల్ సర్వీస్ రూల్స్, 2005ను ఉల్లంఘించి పదోన్నతలు కల్పించారని సుప్రీం కోర్టు తెలిపింది.  ఇది చట్టవిరుద్ధమని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 
 
పదోన్నతలు పొందిన జడ్జీలందరినీ అంతకుముందున్న స్థానాలకు పంపాలని ఆదేశించింది. పదోన్నతలు ఎలా కల్పించారో చెప్పాలని, మెరిట్ లిస్ట్‌ను తమ ముందు ఉంచాలని గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

karnataka election results: రాహుల్ గాంధీ Bharat Jodo Yatra ప్రభావం చూపిందా?