Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిజోరంలో అధిక పిల్లలుంటే రూ.లక్ష బహుమతి

మిజోరంలో అధిక పిల్లలుంటే రూ.లక్ష బహుమతి
, మంగళవారం, 22 జూన్ 2021 (12:00 IST)
దేశంలోని చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణను కోరుతుంటే.. మిజోరం మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తూ సంచలన ప్రకటన చేసింది. అధిక సంఖ్యలో పిల్లలున్నవారికి రూ.లక్ష నగదు బహుమానాన్ని కూడా ప్రకటించింది. సర్టిఫికెట్‌, ట్రోఫీ కూడా ఇస్తామని పేర్కొంది.
 
మిజోరం రాష్ట్ర మంత్రి రాబర్ట్‌ రోమావియా రాయ్టే మాట్లాడుతూ... 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014 మంది ఉన్నారని, అతితక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరొందిందని తెలిపారు. మిజో జనాభా తగ్గుతుండటం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ఐజాల్‌ ఈస్ట్‌ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సంతానం ఉన్న సజీవ పురుషుడు, లేదా స్త్రీకి లక్షరూపాయల నగదు బహుమతిని ఇస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో పాటు సర్టిఫికెట్‌, ట్రోఫీని కూడా ఇస్తామన్నారు.

ఈ ప్రోత్సాహక బహుమతి ఖర్చును మంత్రి కుమారుడి యాజమాన్యంలోని నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరించనుంది. మిజో వర్గాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పిల్లలతో నివశిస్తున్న తల్లిదండ్రులకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి రాబర్ట్‌ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకరికి బదులుగా మరొకరి పొట్ట కోసిన డాక్టర్: కేకలు వేసిన బాధితురాలు