Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రుడిపై నీళ్లున్నాయోచ్... చంద్రయాన్ తేల్చేసింది మరి...

మన భారతదేశం 10 సంవత్సరాల క్రితం పంపిన చంద్రయాన్-1 అనే అంతరిక్ష నౌక సేకరించిన డేటా సహాయంతో చంద్రునిపై ఘనీభవించిన నీటి నిక్షేపాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2008లో పంపిన భారతదేశ తొలి లూనార్ ప్రోబ్ చంద్రయాన్-1లో కొంతకాలం తర్వాత సమస్యలు

చంద్రుడిపై నీళ్లున్నాయోచ్... చంద్రయాన్ తేల్చేసింది మరి...
, బుధవారం, 22 ఆగస్టు 2018 (16:22 IST)
మన భారతదేశం 10 సంవత్సరాల క్రితం పంపిన చంద్రయాన్-1 అనే అంతరిక్ష నౌక సేకరించిన డేటా సహాయంతో చంద్రునిపై ఘనీభవించిన నీటి నిక్షేపాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2008లో పంపిన భారతదేశ తొలి లూనార్ ప్రోబ్ చంద్రయాన్-1లో కొంతకాలం తర్వాత సమస్యలు ఏర్పడటంతో 2009 అగస్టు 28న రేడియో సంకేతాలు రావడం నిల్చిపోయాయి. అప్పటికే అది దాని లక్ష్యాలలో 95 శాతం వరకూ సాధించింది. ఆ తర్వాత మిషన్ ముగిసినట్లు ఇస్రో నిర్ణయించింది. 2016లో నాసా రాడార్ వ్యవస్థలను ఉపయోగించి చంద్రయాన్‌ని మళ్లీ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
 
చంద్రుని ఉపరితలంపై మంచు ఉన్నప్పటికీ, పైన కొన్ని మిల్లీమీటర్ల పరిధిలో మన అవసరాలకు ఉపయోగించుకోగల లేదా మనం చంద్రునిపై ఉండటానికి వీలుగా నీరు ఉందని తెలిపారు. అధ్యయనం ప్రకారం మంచు నిక్షేపాలు అక్కడక్కడా చెదురుమదురుగా విస్తరించి చాలాకాలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
దక్షిణ ధృవం వద్ద మంచంతా పెద్దపెద్ద రంధ్రాలలో కేంద్రీకృతమై ఉంది, కానీ ఉత్తర ధృవం వద్ద విస్తారంగా వ్యాపించి పరిమాణంలో తక్కువగా ఉంది. చంద్రుని ఉపరితలంపై మంచు ఉన్నట్లు ఖచ్చితంగా నిర్ధారించే మూడు సంకేతాలను గుర్తించడానికి నాసా శాస్త్రవేత్తలు మూన్ మైనరాలజీ మ్యాపర్ (M3) అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది 2008లో ఇస్రో పంపిన చంద్రయాన్-1 లాగానే చంద్రునిపై మంచు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించడానికి ప్రత్యేకంగా నిర్మించబడింది.
 
ఇది సాధారణంగా మంచుకి ఉండే ధర్మాలను బట్టి గుర్తించడమే కాక, వాటి అణువులు గ్రహించే పరారుణ కాంతి ఆధారంగా కూడా నీరు, బాష్పము మరియు మంచుని వేరువేరుగా గుర్తిస్తుంది. చాలావరకు మంచు ధృవాల వద్ద క్రేటర్స్ నీడలో ఉంది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 156 డిగ్రీల సెల్సియస్ మించి ఉండదు. చంద్రుని భ్రమణ అక్షం ఏటవాలుగా ఉన్నందున సూర్యకాంతి ఆ ప్రదేశాలకు చేరదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో అద్భుతం.. డ్రైవర్ లేని బైకుపై చిన్నారి.. 300 మీటర్ల జర్నీ!