Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటక రాష్ట్రంలో కుప్పకూలిన ట్రైనీ హెలికాఫ్టర్

Advertiesment
aricraft crash
, గురువారం, 1 జూన్ 2023 (14:59 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. రాష్ట్రంలోని చామరాజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టరులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరు మహిళా పైలెట్ కావడం గమనార్హం. ఈ మేరకు వాయుసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. 
 
కాగా, తమ రోజువారీ శిక్షణలో భాగంగా, వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్‌ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజ నగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో ఈ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలెట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్పంగా గాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త తుదిశ్వాస విడిచిన నాలుగు గంటల్లో భార్య మృతి