Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను ప్రతి జంతువులో దేవుడిని చూస్తున్నాను.. అనంత్ అంబానీ

Anant Ambani

సెల్వి

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (22:22 IST)
Anant Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ- రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, 2024 ప్రత్యేక సంవత్సరంగా ఉంటుందనే చెప్పాలి. 
 
అంబానీ వారసుడు ఈ ఏడాది రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1-3 తేదీ వరకు ఈ వివాహం జరుగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. 
 
ఈ పెళ్లి వేడుకల మధ్య జంతువుల కోసం పునరావాసం ఏర్పరిచారు. వంటారా (స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెస్క్యూ, ట్రీట్‌మెంట్, కేర్‌పై దృష్టి సారించే చైన్‌ బిజినెస్ ఇది. గాయపడిన జంతువులకు ఈ సెంటర్ పునరావాసం కల్పిస్తుంది. 
 
గుజరాత్‌లోని రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని గ్రీన్ బెల్ట్‌లో ఉన్న వంటారా ప్రపంచవ్యాప్తంగా జంతువుల పరిరక్షణ కేంద్రంగా వుంటుంది. జంతు సంరక్షణ, సంక్షేమంలో ప్రముఖ నిపుణులతో కలిసి వంటారా పనిచేస్తుంది. ఈ కేంద్రం దట్టమైన అడవుల తరహాలో వుంటుంది. సహజమైన, సుసంపన్నమైన, పచ్చని ఆవాసాలను అనుకరిస్తుంది.  
webdunia
Vantara
 
తాజాగా ఇంటర్వ్యూలో వంటారా గురించి అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు. "నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, జంతువులను జాగ్రత్తగా చూసుకోమని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ వుంటారు. మా నాన్న అతిపెద్ద వన్యప్రాణులలో ఒకరు. ఉదాహరణకు, మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు, 18 సంవత్సరాల వయస్సు వరకు, ఆఫ్రికా, రణథంబోర్, కన్హా, బాంధవ్‌ఘర్, కాజిరంగా అడవులకు తప్ప మరే ఇతర కుటుంబ సెలవులకు వెళ్లలేదు. 
 
మా నాన్న మమ్మల్ని సెలవులకు అడవికి మాత్రమే తీసుకెళ్లేవారు. కాబట్టి వారు నన్ను ప్రేరేపించారని భావిస్తున్నాను. పెంపుడు జంతువుల కోసం, దేశవ్యాప్తంగా చాలా మంచి పనులు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ వన్యప్రాణుల కోసం, చాలా తక్కువ మంది ఉన్నారు. వన్యప్రాణులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. 
 
మన దగ్గర 50-60 కంటే ఎక్కువ అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. ఇప్పటికే వివిధ నేపథ్యాల నుండి, సర్కస్‌ల నుండి, రోడ్డు ప్రమాదాల నుండి, జంతు-మానవ సంఘర్షణల నుండి, రద్దీగా ఉండే జంతుప్రదర్శనశాలల నుండి వన్య ప్రాణులను రక్షించాం. 
 
అందుకే వన్య ప్రాణాలను కాపాడటానికి  అత్యాధునికమైన హాస్పిటల్ కావాలి అనుకున్నాను. మాకు అత్యాధునిక సదుపాయం కావాలి. నేను వాటిని బోనులలో ఉంచడం ఇష్టం లేదు. వాటిని సహజ ఆవాసాలలో ఉంచాలనుకుంటున్నాను. అందుకే చాలా కష్టపడ్డాం. అలా వంటారాను సిద్ధం చేశాం. ఇది అవసరమా.. అంటూ చాలామంది అడిగారు. 
 
కానీ వన్య ప్రాణుల సంరక్షణే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశాం. మన సనాతనంలో, ప్రతి దేవత హృదయానికి దగ్గరగా ఉండే జంతువును వాహనంగా కలిగి ఉంటుందని మీకు తెలుసు. ప్రతి దేవతకు ఒక వాహనం ఉంటుంది. ఋగ్వేదంలో, కృష్ణుడు అన్ని జీవులు సమానం. మానవుడు లేదా తేనెటీగ, చీమ కావచ్చు. అంతా సమానమే. ఇక్కడ మేము కప్పల నుండి ఎలుకల వరకు ప్రతిదానికీ జాగ్రత్త తీసుకుంటాము.
 
చాలా మంది వ్యక్తులు మానవ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు, కానీ జంతు సంరక్షణలో, కొంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు. జంతు సంరక్షణ కోసం నేను ఎంపిక చేసుకున్నవాడిని అని నేను భావిస్తాను. భగవంతుని ఆశీర్వాదంతో నేను జంతువుల సేవ చేయగలిగినంత అదృష్టవంతుడిని. 
webdunia
Vantara
 
నేటి జీవితంలో మీరు దేవుడిని చూడలేరు, కానీ నేను ప్రతి జంతువులో దేవుడిని చూస్తున్నాను. గోవులో 64 కోట్ల మంది దేవతలు ఉంటారని మన ధర్మంలో చెప్పారు. కానీ నాకు, ఆవులో మాత్రమే కాదు, ప్రతి జంతువులోనూ దేవతలను చూస్తాను... అంటూ అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగరేణి ఉద్యోగులకు రూ.కోటితో ప్రమాద బీమా సదుపాయం : సీఎం రేవంత్ రెడ్డి