Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఎంపీలకు పనిష్మెంట్ పేరుతో సర్‌ప్రైజ్ విందు ఇచ్చిన ప్రధాని మోడీ!!

Advertiesment
modi lunch

ఠాగూర్

, శనివారం, 10 ఫిబ్రవరి 2024 (09:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఎనిమిది మంది ఎంపీలకు పనిష్మెంట్ పేరుతో సర్‌ప్రైజ్ విందు ఇచ్చారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన యంగ్ ఎంపీ రామ్మెహన్ నాయుడు కూడా ఉన్నారు. పార్లమెంట్ క్యాంటీన్‌లో వీరందరినీ ఆయన సర్‌ప్రైజ్ చేశారు. తనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసే అవకాశాన్ని కల్పించారు. వీరిలో బీజేపీ ఎంపీలు హీనా గనిత్, ఎస్.ఫాంగ్నాన్ కొన్యాక్, జమ్యాంగ్ త్సెరింగ్ నామ్ గ్యాల్, ఎల్.మురుగన్‌, రామ్మోహన్ నాయుడులతో పాటు.. బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీఎంపీ సస్మిత్ పాత్రలు ఉన్నారు. ఈ అనూహ్య విందుతో ఎంపీలంతా ఆశ్చర్యచకితులయ్యారు. 
 
"ప్రధాని మోడీ మధ్యాహ్నం 2.30 గంటలకు మిమ్మల్ని కలవానుకుంటున్నారు" అంటూ ఆ ఎనిమిది మంది ఎంపీలకు సందేశం అందింది. దీంతో ఎంపీలంతా మోడీ గదికి వెల్లారు. ఎంపీలను చూసిన మోడీ... పదండి.. మీ అందరికి శిక్ష విధించాలి అంటూ క్యాంటీన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫూర్తి శాఖాహార భోజనంతో వారికి విందు ఇచ్చారు. ఈ బిల్లును ప్రధానమంత్రి చెల్లించారు. తీరికలేని షెడ్యూల్స్.. విదేశీ పర్యటనలు, గుజరాత్ రాష్ట్రంతో పాటు పలు అంశాలపై ప్రధాని మోడీ మోట్లాడారని వివరించారు. ప్రధాని మోడీతో కలిసి భోజనం చేయడం గొప్ప అనుభవమని ెలిపారు. కాగా, ఈ సర్‌ప్రైజ్ భోజనానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ పార్టీలకు చెందిన సహచర ఎంపీలతో సంతృప్తికరంగా మధ్యాహ్నం భోజనం చేశారనని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాట తొలిసారి రైల్వే టీసీగా హిజ్రా!!