Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెపటైటిస్ బి లక్షణాలు ఏమిటి?

hepatitis

సిహెచ్

, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (21:00 IST)
హెపటైటిస్ బి సోకిన చాలా మందికి లక్షణాలు కనిపించవు. తీవ్రమైన హెపటైటిస్ బి ఉన్న కొందరు వ్యక్తులు వైరస్‌ సోకిన తర్వాత 2 నుండి 5 నెలల తర్వాత లక్షణాలను కలిగి ఉంటారు. వారిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ముదురు పసుపు రంగులో మూత్రం వుంటుంది.
ఎప్పుడూ శరీరం డస్సిపోయి అలసినట్లు అనిపిస్తుంది.
తరచూ జ్వరం వుంటుంది, బూడిద లేదా మట్టి రంగులో మలం వుంటుంది.
కీళ్ల నొప్పి వుంటుంది, ఇంకా ఆకలి లేకపోవడం జరుగుతుంది.
వికారంగానూ, కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటాయి.
పసుపు రంగులో కళ్ళు, చర్మం కనిపిస్తాయి, వీటినే కామెర్లు అని పిలుస్తారు.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్నవారు, శిశువులు, పిల్లలు సాధారణంగా తీవ్రమైన హెపటైటిస్ బి లక్షణాలను కలిగి ఉండరు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యకరమైన డెజర్ట్‌: తియ్యందనపు కోరికలను తీర్చుకోవడానికి గ్లూటెన్ రహిత ఆల్మండ్ కేక్ రెసిపీ