Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాఠశాల లో ర్యాగింగ్ భూతం...! విద్యార్థి ఆత్మహత్య యత్నం

Advertiesment
పాఠశాల లో ర్యాగింగ్ భూతం...! విద్యార్థి ఆత్మహత్య యత్నం
, సోమవారం, 8 జులై 2019 (15:14 IST)
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మాన్ ఘాట్‌లోని "నియో రాయల్" పాఠశాలలో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడడంతో భయాందోళనకుగురైన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన రవికిరణ్ కర్మాన్ ఘాట్‌లోని నియో రాయల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు  కలసి ర్యాగింగ్ చేసి డబ్బులు తీసుకొని రావాలని బెదిరిచడంతో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.6 వేలు ఇచ్చిన రవికిరణ్... మళ్లీ డబ్బులు తేవాలని బెదిరిచడంతో స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై ప్రిన్స్‌పాల్ లేదా స్కూల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆ విద్యార్థి మానసిక వేదనకు లోనయ్యాడు. పైగా, రవికిరణ్‌కు ఈ తరహా వేధింపులు తప్పలేదు. దీంతో ఈ వేధింపులను తాను భరించలేనని లెటర్ రాసిపెట్టి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఎల్బీనగర్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 
 
పాఠశాలలో వేధింపులు జరుగుతున్న, మీ దృష్టికి తీసుకవచ్చిన ఎందుకు తగు చర్యలు తీసుకోలేదని యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. జరిగిన సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోకాళ్ళపై కూర్చోబెట్టి గుంజిళ్లు తీయించారు.. ఎందుకు?