అక్రమ సంబంధాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. వివాహేతర సంబంధాలను క్రూరత్వం అని చెప్పలేం..
అక్రమ సంబంధాలపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని భార్య దృష్టిలో క్రూరత్వం అని ప్రతిసారీ అనలేమని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాల్లో కేసుల వారీగా
అక్రమ సంబంధాలపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని భార్య దృష్టిలో క్రూరత్వం అని ప్రతిసారీ అనలేమని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాల్లో కేసుల వారీగా నిజానిజాలను నిర్ధారించాల్సి వుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కర్ణాటకలో ఓ కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించిన కేసులో, నిందితుడి పిటిషన్ మేరకు విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా, అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం, శిక్ష నుంచి నిందితుడిని విముక్తిడిని చేసింది. ఈ కేసులో భర్త వివాహేతర సంబంధంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. తనపై వచ్చిన ఆరోపణలతో అతనితో బంధం నడిపిన మహిళ కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. దీంతో ఆమె తల్లి, సోదరుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ కేసు విచారణకు రాగా, దిగువ కోర్టు నిందితునికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా, కర్ణాటక హైకోర్టు దాన్ని ఖరారు చేసింది. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు నమోదైన సెక్షన్ చెల్లదని అభిప్రాయపడ్డ సుప్రీం ధర్మాసనం సదరు వ్యక్తిని విడుదల చేసింది.