Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వానికి లెక్క చూపలేని సొమ్ముపై ఆర్బీఐ కన్ను.. డబ్బు లాక్ అయిపోద్ది..

ప్రభుత్వానికి లెక్క చూపలేని సొమ్ముపై ఆర్బీఐ కీలకనిర్ణయాలను తీసుకునేందుకు రెడీ అయ్యింది. ప్రభుత్వానికి లెక్కలు చూపని సొమ్ము మీ వద్ద ఉంటే... 50 శాతం పన్ను విధించడమే కాక మిగతా 50 శాతం దాంట్లో సగం నాలుగేళ

Advertiesment
Ban on Rs 500
, శనివారం, 26 నవంబరు 2016 (10:33 IST)
ప్రభుత్వానికి లెక్క చూపలేని సొమ్ముపై ఆర్బీఐ కీలకనిర్ణయాలను తీసుకునేందుకు రెడీ అయ్యింది. ప్రభుత్వానికి లెక్కలు చూపని సొమ్ము మీ వద్ద ఉంటే... 50 శాతం పన్ను విధించడమే కాక మిగతా 50 శాతం దాంట్లో సగం నాలుగేళ్లపాటు బ్యాంకులోనే ఆ డబ్బు లాక్‌ అయ్యేలా చేస్తారు. నాలుగేళ్ల వరకు ఆ డబ్బును విత్‌ డ్రా చేయకుండా ప్రభుత్వం కట్టడి చేయనుంది.
 
ఒక వేల డిసెంబర్‌ 30 తర్వాత నల్లధనం పట్టుబడితే 90 శాతం పన్నుతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపో, మాపో పార్లమెంట్‌లో ఐటీ చట్ట సవరణ బిల్లు‌ను కేంద్ర ప్రభుత్వం పెట్టనుందని తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఖాతాలో రూ2.50 లక్షలకు మించి జమ చేయకపోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
మరోవైపు నవంబర్ 24తో పాత నోట్ల మార్పిడి అవకాశం అన్ని బ్యాంకులలో ముగియడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత రిజర్వు బ్యాంక్ పేర్కొంది. ప్రజలు తమ పాత నోట్లను బ్యాంకులలో జమ చేసుకోవచ్చని, ఒక వేళ మార్పిడి చేసుకోవాలనుకుంటే ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. రద్దైన రూ. 500, 1000 నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద మార్చుకోవచ్చని తెలిపింది. 
 
ప్రజల కోసం అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఈ పాత నోట్ల(రూ.2వేల వరకు) మార్పిడికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త కరెన్సీ నోట్లు వరకట్నంగా ఇస్తేనే మూడుముళ్లు వేస్తా.. వరుడు పట్టు