కొత్త కరెన్సీ నోట్లు వరకట్నంగా ఇస్తేనే మూడుముళ్లు వేస్తా.. వరుడు పట్టు
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నోట్ల రద్దుతో అనేక వివాహాలు ఆగిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో పెళ్లి కొడుకు విధించిన షరతుతో
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నోట్ల రద్దుతో అనేక వివాహాలు ఆగిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో పెళ్లి కొడుకు విధించిన షరతుతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తనకు కొత్త నోట్లు, కారు కట్నంగా ఇస్తేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, లేకుంటే తాళి కట్టే ప్రసక్తే లేదని పెళ్లికి ఒక రోజు ముందు వరుడు మొండికేశాడు.
పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి.. పిండివంటలను సిద్ధంచేసి బంధువులను ఇంటికి పిలిచి.. తెల్లారే వివాహానికి సిద్ధమవుతుండగా వరుడు ఈ విధంగా షాక్ ఇవ్వడంతో వధువు కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. కారు, కొత్త నోట్లు కట్నంగా ఇవ్వాలని వరుడు డిమాండ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వరుడు ముందే షరతు పెట్టాడని, పెద్దనోట్ల రద్దుతో వాటిని తాము సమకూర్చకపోవడంతో పెళ్లిపీటలు ఎక్కనని వరుడు మొండికేస్తున్నాడని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.