Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదిన కోసం భార్యను చంపేశాడు... జీవితశిక్ష విధించిన కోర్టు

కామంతో కళ్లుమూసుకుని పోయిన ఓ వ్యక్తి.. వదిన కోసం కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ కేసులో ముద్దాయికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. శుక్రవారం వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీల

Advertiesment
husband
, శనివారం, 6 ఆగస్టు 2016 (12:13 IST)
కామంతో కళ్లుమూసుకుని పోయిన ఓ వ్యక్తి.. వదిన కోసం కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ కేసులో ముద్దాయికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. శుక్రవారం వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
నెల్లూరు జిల్లా గూడూరు దూర్జటి నగర్‌కు చెందిన పేల్లేటి గోవిందు రెండో కుమారుడు సురేష్‌ అదే ప్రాంతానికి చెందిన తమలపాకుల పెరుమాళ్లు, యశోదమ్మల కుమార్తె కుమారిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. పట్టణంలోని రాజావీధిలో భార్యతో కలసి వేరు కాపురం పెట్టాడు. పట్టణ సమీపంలోని ఓ కర్మాగారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్థానికంగా నివశించే వదిన వరుసైన ఓ మహిళతో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. 
 
ఈ విషయం భార్యకు తెలిసింది. వదినతో ఇలా తిరగడం మంచిది కాదంటూ దండించింది. ఇది భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో 2008 అక్టోబరు 28వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా సురేష్ అమ్మానాన్నలు స్వగ్రామానికి వెళ్లగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సురేష్‌ భార్య కుమారిని కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. 
 
ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, కుమారి తల్లిదండ్రులు మాత్రం అల్లుడు తమ కుమార్తెను హత్య చేశారనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, నెల్లూరు ఏడో అదనపు జిల్లా జడ్జి గుర్రప్ప విచారించి... సురేష్‌ హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిడ్డను ప్రసవించింది.. ఆస్పత్రిలోనే వదిలి వెళ్ళిపోయింది.. ఎందుకు?