బిడ్డను ప్రసవించింది.. ఆస్పత్రిలోనే వదిలి వెళ్ళిపోయింది.. ఎందుకు?
అమ్మాయి పుట్టిందనో లేకుంటే, పెళ్లి కాకుండా తల్లైందో తెలియదు కానీ వైద్యశాలలో ఓ మహిళ ప్రసవించిన బిడ్డను అలాగే వదిలి వెళ్లిపోయింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 27న ఓ గుర్త
అమ్మాయి పుట్టిందనో లేకుంటే, పెళ్లి కాకుండా తల్లైందో తెలియదు కానీ వైద్యశాలలో ఓ మహిళ ప్రసవించిన బిడ్డను అలాగే వదిలి వెళ్లిపోయింది.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 27న ఓ గుర్తుతెలియని యువతి బిడ్డను ప్రసవించి గుట్టుచప్పుడు కాకుండా వదిలి వెళ్లిపోయింది. దీంతో వైద్యశాల సిబ్బంది ఏమిచేయాలో తెలియక శుక్రవారం కంభం పోలీస్ స్టేషన్‌లో పసికందును అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు బేస్తవారిపేట ఐసీడీ ఎస్ సీడీపీవో ధనలక్ష్మికి తెలపగా బిడ్డను ఒంగోలు బాలసదన్‌కు తీసుకువెళ్ళారు. యువతి పెళ్లి కాకుండా తల్లి అయ్యి వైద్యశాలలో ప్రసవించి వెళ్లిపోయిందా లేక అమ్మాయి పుట్టిందని వదిలి వెళ్ళిపోయిందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.