చెల్లాచెదురుగా బట్టలు, బూట్లు, ఒక బ్యాగ్, ఒక సూట్‌కేస్, రక్తపు మరకలు, దుర్గంధం, మగ్గిన శరీర భాగాలు.. ఫ్రిడ్జ్‌లో మూడు అలమరల్లో పేర్చబడ్డాయి. ఇదంతా ఓ మహిళను హత్య చేసి ఆమె శరీర అవశేషాలను ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టబడిన దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు.
పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు బెంగళూరు వైయాలికావల్‌లోని హతురాలి ఇంటిని పరిశీలించారు.అక్కడ 29 ఏళ్ల మహిళ యొక్క ఛిద్రమైన మృతదేహం సెప్టెంబరు 21న కనుగొనబడింది.
58 ఏళ్ల మీనా రాణా ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించి తన కుమార్తె మహాలక్ష్మి ఛిద్రమైన మృతదేహాన్ని మొదట కనుగొన్నారు. ఆపై మీనా మహాలక్ష్మి భర్త ఇమ్రాన్‌కు సమాచారం అందించింది. అతను పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వయాలికావల్ సమీపంలోని పైప్‌లైన్ రోడ్డులోని జి+3 భవనం మొదటి అంతస్తులో మహాలక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది.
దాదాపు 35 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం మహాలక్ష్మి కుటుంబం వెతుక్కుంటూ బెంగళూరు వచ్చింది. మహాలక్ష్మి తల్లి మీనాకు నలుగురు పిల్లలు. వీరిలో ముగ్గురు పెళ్లి చేసుకుని సెటిల్ కాగా, మహాలక్ష్మి మాత్రం భర్తకు దూరంగా వుంటోంది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి హత్యకు గురైంది.
వయాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు మహాలక్ష్మి (29) వ్యక్తిగత కారణాలతో తన బిడ్డతో పాటు ఐదు నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
తన భర్త హుకుమ్ సింగ్ నేలమంగళలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలికి, ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం వల్ల అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హతుడు మహాలక్ష్మిని హత్య చేసి దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ సతీష్ మాట్లాడుతూ.. ఒకే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నామన్నారు.