మందు బాబులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఇకపై మందు బాటిళ్లపై ఆవుల సుంకం (కౌ సెస్) వసూలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున విధిస్తామని తెలిపింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.100 కోట్ల మేరకు వస్తాయని, ఈ నిధులను రాష్ట్రంలో పాడిపరిశ్రమల అభివృద్ధికి ఖర్చుచేస్తామని తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సెస్‌ను వసూలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుసు వీలుగా ఆవు, గెదె పాలను కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, ప్రభుత్వం కూడా భారీ ఎత్తున వీటిని కొనుగోలుచేయనుంది. ఈ క్రమంలోనే ఆవు సెస్ వసూలు చేయాలని ప్రతపాదించింది.
ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే.. రూ.53413 కోట్ల బడ్జెట్ ఉంటగా ఇందులో పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు వీలుగా హిం-గంగా ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. ఇందులోభాగంగా, 2.31 లక్షల మంది పాడి రైతులకు రూ.1500 మేరకు వింఛను అందజేస్తారు.