Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెచ్చరిల్లిపోతున్న హిజ్రా గ్యాంగ్ అరాచకాలు.. ప్రైవేట్ పార్ట్ కోసేసి నాటు వైద్యం చేశారు..!

హిజ్రాల దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమాయకులుగా కనిపించే యువకులను వలలో వేసుకుని లేదా కిడ్నాప్ చేసి బలవంతంగా లింగమార్పిడికి పాల్పడుతున్న హిజ్రా గ్యాంగ్‌ మాఫియా ఉదంతం బయటపడింది. హిజ్రా గ్యాంగ్‌లో చేర

Advertiesment
Hijras Mafia Hulchul In Bangolore
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (10:41 IST)
హిజ్రాల దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమాయకులుగా కనిపించే యువకులను వలలో వేసుకుని లేదా కిడ్నాప్ చేసి బలవంతంగా లింగమార్పిడికి పాల్పడుతున్న హిజ్రా గ్యాంగ్‌ మాఫియా ఉదంతం బయటపడింది. హిజ్రా గ్యాంగ్‌లో చేరడం ఇష్టం లేదని చెప్పేసిన 18 సంవత్సరాల యువకుడిని హిజ్రాలు కిడ్నాప్ చేశారు. పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసి నాటు వైద్యం ప్రకారం లింగమార్పిడి చేశారు. 
 
అయితే మూత్రవిసర్జన సాధ్యం కాక నరకయాతనకు లోనైన యువకుడిని కొందరు కాపాడి తక్షణం ఆసుపత్రికి తరలించారు. ఈ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మేఘరిక్‌ వెల్లడించారు. బెంగళూరు కాక్స్‌టౌన్ ప్రాంతంలో జరిగిన ఘటన నగర ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
 
ఈ ఘటనపై హిజ్రాల సంఘాలు కూడా తీవ్రంగానే స్పందించాయి. బలవంత లింగమార్పిడిలకు తాము తీవ్ర వ్యతిరేకమని స్పష్టం చేశాయి. మానసిక, శారీరక హింసలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. మర్మాంగం కోల్పోయిన యువకుడిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురైన యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఏడాది కొకసారి మాటమార్చే వెంకయ్య నోటిని ఫినాయిల్‌తో కడగాలి' : సీపీఐ నారాయణ