Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదే కుక్కలకీ మనుషులకీ ఉన్న తేడా... రాత్రి 11 గంటల వరకూ ఆ కుక్క అక్కడే (Video)

కుక్కకి ఒక్కసారి బిస్కెట్ వేసి చూడండి. ఇక అది జన్మలో మిమ్మల్ని మరిచిపోదు. అంతేనా... ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా మీ కోసం అలాగే ఎదురుచూస్తుంటుంది. మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లు పరుగులు తీస్తుంటు

Advertiesment
dog
, శుక్రవారం, 2 మార్చి 2018 (21:35 IST)
కుక్కకి ఒక్కసారి బిస్కెట్ వేసి చూడండి. ఇక అది జన్మలో మిమ్మల్ని మరిచిపోదు. అంతేనా... ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా మీ కోసం అలాగే ఎదురుచూస్తుంటుంది. మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లు పరుగులు తీస్తుంటుంది. కనబడకపోతే కెవ్వుమంటూ మొరుగుతుంది. ఐతే మనుషులు అలాక్కాదని వేరే చెప్పక్కర్లేదు. ఎవరో నూటికీ కోటికీ విశ్వాసపాత్రులు వుంటారనుకోండి.
 
ఇప్పుడు ఈ కుక్క సంగతి ఏంటా అనుకుంటున్నారా... మరేంలేదు... ముంబైలో ఓ కుక్క ప్రతిరోజూ కంజుమార్గ్ స్టేషనులో వేచి వుండటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు... ఆ కుక్క ప్రత్యేకించి 11 గంటలకు ఆ స్టేషనుకు వచ్చే రైలు కోసం వేచి చూస్తుంది. రైలు అలా ఫ్లాట్ ఫాంపైకి వచ్చీ రాగానే పరుగు పరుగున మహిళా భోగీ దగ్గరకు వెళుతోంది. 
 
ఆ భోగీ లోనికి ఎంతో ఆశగా తొంగిచూస్తుంది. ఐతే ఇంతలో రైలు కదిలిపోతుండటంతో దాని వెంట కొద్ది దూరం పరుగులు తీస్తుంది. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. మరుసటి రోజు రాత్రి 11 గంటలకు ఎదురుచూపు. ఈ వ్యవహారం ఆ స్టేషనులో రైలెక్కే ప్రయాణికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 
 
ఆ కుక్క ప్రత్యేకించి మహిళా రైలు భోగీ దగ్గర మాత్రమే ఆగడం, ఎదురుచూడటాన్ని బట్టి దాని యజమానురాలో లేదంటే తనకు రోజువారీ ఆహారం పెట్టేవారు ఎవరో కనిపించకుండా పోయి వుంటారని చెప్పుకుంటున్నారు. ఈ ఆడ కుక్క ప్రత్యేకించి ప్రతిరోజూ అలా ఎదురుచూస్తూ వుండటం సీసీ టీవీలో రికార్డయింది. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. ఆ కుక్క విశ్వాసం ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. చూడండి వీడియోను...
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహిరంగంగా ఆ తల్లి చనుబాలు ఇచ్చింది.. గృహలక్ష్మి ఫోటో వైరల్..