Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ సినిమా చూపించింది- మద్యం, అమ్మాయిల సరఫరా పచ్చి అబద్ధమే.. మారువేషంలో గోడదూకి?

తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ప్రతికూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో.. ఆమెతో పన్నీర్‌కు పోటీ వుండదని అనుకున్నా.. ఆమె వ

Advertiesment
శశికళ సినిమా చూపించింది- మద్యం, అమ్మాయిల సరఫరా పచ్చి అబద్ధమే.. మారువేషంలో గోడదూకి?
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (12:20 IST)
తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ప్రతికూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో.. ఆమెతో పన్నీర్‌కు పోటీ వుండదని అనుకున్నా.. ఆమె వర్గం నుంచి ఎవరైనా ఒకరు ఓపీకి యాంటీగా పోరుకు సై అనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలు పోలీసుల వద్ద తాముగా రెసార్ట్‌కు వెళ్ళామని.. మమ్మల్ని కిడ్నాప్ చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చినా.. శశికళ అనుచరులు తమను చిత్రహింసలకు గురిచేశారని శశికళ శిబిరం నుంచి బయటికి వచ్చిన మథురై (సౌత్) ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్ ఆరోపిస్తున్నారు. 
 
ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతూ.. శశికళ శిబిరం నుంచి తప్పించుకుని మంగళవారం పన్నీర్‌సెల్వం అనుచరగణంలో చేరారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మమ్మల్ని ఒకేచోట నిర్భంధించారు. మానసికంగా, శారీరకంగా వేధించారు. అయితే మేము మాత్రం ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా పన్నీర్ సెల్వంకు మద్దతు కొనసాగిస్తూ వచ్చామని శరవణన్ తెలిపారు. 
 
ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీలో ఉన్న గవర్నర్ ముందు ప్రవేశపెట్టేందుకు బస్సుల్లో చెన్నై ఎయిర్‌పోర్టుకు తరలించారనీ.. అయితే ఆయనే చెన్నై వస్తున్నారని తెలియడంతో ప్లాన్ మొత్తం మారిపోయిందన్నారు. ''రీసార్ట్‌లో మాకు మద్యం, అమ్మాయిలను సరఫరా చేశారనీ మీడియాలో వచ్చిన వార్తలన్నీ పచ్చి అబద్దం. మా నియోజక వర్గాల ప్రజలతో ఫోన్ ద్వారా రోజు మాట్లాడుతూనే ఉన్నాం'' అని శరవణన్ అన్నారు.
 
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే? శరవణన్ గోడదూకి మరీ సెల్వం క్యాంపుకు చేరారు. సాధారణంగా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటారు. అలా పార్టీలు మారినప్పుడు గోడలు దూకారని చెబుతారు. కానీ ఎమ్మెల్యే శరవణన్ మాత్రం నిజంగానే గోడ దూకారు. అదీ పన్నీర్ సెల్వం కోసం. 
 
మధురై ఎమ్మెల్యే శరవణన్ వారం రోజులుగా శశికళ శిబిరంలోనే ఉన్నారు. ఆయన పేరుకే అక్కడ ఉన్నారు కానీ మనసంతా సెల్వం వైపే ఉంది. ఎందుకంటే ఆయన మొదట నుంచి సెల్వం మనిషే. కాబట్టి క్యాంప్ నుంచి బయట పడేందుకు అన్నిరకాలుగా ఆలోచించారు. కుదరలేదు. పైగా ఆయనపై శశికళ వర్గానికి అనుమానం వచ్చిందట. దీంతో శరవణన్‌ను నీడలా ఫాలో అయ్యారట. 
 
ఇక బయటపడేందుకు అవకాశం లేకపోవడంతో సోమవారం రాత్రి పక్కా స్కెచ్ వేశారు. అర్థరాత్రి మాట మారువేషం వేసుకున్నారట. ఏకంగా రిసార్ట్ గోడ దూకి అక్కడ్నుంచి పరారయ్యారు. గోడదూకి జంప్ అయిపోయిన శరవణన్ నేరుగా సెల్వం దగ్గరకు వెళ్లిపోయారు. సెల్వం సారుకు జై కొట్టి గురుభక్తిని చాటుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత అక్రమాస్తుల కేసు పూర్వాపరాలివి... శశికళ ముద్దాయి నం.2