Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో కలిసి రిసార్ట్ వెళ్లిన పాపానికి.. వీడియోలో పలుమార్లు అత్యాచారం..

ప్రియుడితో కలిసి రిసార్ట్ వెళ్లిన పాపానికి.. వీడియోలో పలుమార్లు అత్యాచారం..
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:05 IST)
ప్రియుడితో కలిసి రిసార్ట్ వెళ్లిన పాపానికి ఆ యువతి అవమానాన్ని మూటగట్టుకుంది. ప్రియుడితో కలిసి రిసార్టుకు వెళ్లిన యువతి అతడితో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. వారిని గమనించి కొందరు యువకులు వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని అనేకసార్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌కు చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతోంది. మూడు నెలల క్రితం బాయ్‌ఫ్రెండ్‌తో ఓ రిసార్టుకు వెళ్లింది. అక్కడ ఓ గదిని ఆ ప్రేమ జంట అద్దెకు తీసుకున్నారు. గదిలో జరిగే తతంగాన్ని కిటికీలో నుంచి చూసిన ముగ్గురు యువకులు దాన్ని రహస్యంగా సెల్‌ఫోన్లో రికార్డు చేశారు. 
 
ఆ తర్వాత వీడియోను యువతికి పంపి... సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. దాన్ని అడ్డం పెట్టుకొని అనేకసార్లు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ వీడియో బయటపడితే కుటుంబ పరువు పోతుందని భావించిన యువతి వారు పిలిచినప్పుడల్లా వెళ్లి ఆ కామాంధుల చేతిలో నలిగిపోయింది. 
 
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మరొకరి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సోకిందనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య.. ఎక్కడ?