Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏడేళ్ల బాలికపై రేప్.. స్కూల్‌కి వెళ్ళి వస్తుండగా.. అడ్డుకుని.. పొలాల్లోకి?

Advertiesment
ఏడేళ్ల బాలికపై రేప్.. స్కూల్‌కి వెళ్ళి వస్తుండగా.. అడ్డుకుని.. పొలాల్లోకి?
, శుక్రవారం, 19 అక్టోబరు 2018 (17:08 IST)
హర్యానా రాష్ట్రంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగొస్తుండగా.. 38 ఏళ్ల వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
అక్టోబర్ 16వ తేదీన స్కూల్ నుండి ఆ బాలిక ఇంటికి వస్తుండగా 38 ఏళ్ల వ్యక్తి ఆ బాలికను అడ్డగించి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని బారి నుంచి ఎలాగోలా బయటపడి.. తీవ్ర రక్తస్రావంతోనే ఆ బాలిక ఇంటికి చేరుకుంది. ఈ ఘటనపై బాధితురాలు తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
బాధితురాలి కుటుంబం ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ సత్పాల్ కుమార్ ప్రకటించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ బీజేపీ మొదటి లిస్ట్... అభ్యర్థులు వీరేనంటూ ప్రచారం..