Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా.. కారణం అదేనా? చికెన్ శాండ్‌విచ్‌లు?

hardik patel
, బుధవారం, 18 మే 2022 (12:50 IST)
పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆపై గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడ్డారు. ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్‌కు వచ్చినప్పడు వీరిద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదు. 
 
అయితే కొద్ది రోజులుగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరాయని ఇటీవల వరుసగా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు తనను పట్టించుకోవడం లేదని, పార్టీని వీడాలని వేధిస్తున్నట్లు తెలిపారు. 
 
అనుకున్నట్టే హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందే హార్దిక్ పార్టీని వీడటం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఇక ట్విట్టర్ ద్వారా హార్దిక్ పాండ్యా తాను కాంగ్రెస్‌కు బైబై చెప్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని నమ్ముతున్నానన్నారు. 
 
ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి  ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసినట్టు తెలిపారు. తాను భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నానంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
 
గుజరాత్ ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశం కాంగ్రెస్ నాయకత్వంకు లేదని..ఆ పార్టీ దగ్గర సరైన రోడ్ మ్యాప్ కూడా లేదన్నారు. సరైన ప్రణాళికలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ఓడిపోయిందని హార్దిక్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు "వారి మొబైల్ ఫోన్‌ల ద్వారా పరధ్యానంలో ఉన్నారు", గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వం వారికి "చికెన్ శాండ్‌విచ్‌లు" అందించడంలో ఎక్కువ ఆసక్తి చూపిందని ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..