లేటెస్ట్ ఐఫోన్ ఇస్తానన్నాడు... డేటింగ్‌కు 2 వేల అమ్మాయిలు సిద్ధపడ్డారు.. ఎక్కడ?
జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పు అయినా కడుతుంది అన్నది సామెత. అలాగే, కోటీశ్వరుడి కుమారుడు ఎలాగైనా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం రోజున తనతో ఓ రాత్రి డిన్నర్ చేసినందుకు లేటెస్ట్ ఐఫోన్ ఇస్తానంటూ ఫ
జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పు అయినా కడుతుంది అన్నది సామెత. అలాగే, కోటీశ్వరుడి కుమారుడు ఎలాగైనా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం రోజున తనతో ఓ రాత్రి డిన్నర్ చేసినందుకు లేటెస్ట్ ఐఫోన్ ఇస్తానంటూ ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టాడు. దీనికి ఏకంగా రెండు వేల మంది అమ్మాయిలు స్పందించారు. చివరకు ఐదుగురిని ఎంచుకుని ఎంజాయ్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
అతని పేరు షకుల్ గుప్తా. ఈ నెల 11న సాయంత్రం 6.47 గంటలకు ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. 'నాకు వాలంటైన్‌గా ఎవరుంటారు? గుర్‌గావ్‌లోని ఒబెరాయ్ హోటల్‌లో డిన్నర్ ఇస్తాను. మీకు నచ్చిన బ్రాండ్ ఐఫోన్-7 ఇస్తాను. మధుర క్షణాలను ఆస్వాదిద్దాం. నా ప్రొఫైల్‌ను చూడండి. మీకు ఆసక్తి ఉంటే కామెంట్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి' అని పేర్కొన్నాడు. పైగా తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ లింక్ కూడా పోస్ట్ చేశాడు. అలాగే తన వ్యక్తిగత వివరాలను కూడా పొందుపరిచాడు.
షకుల్ గుప్తా సోషల్‌గుప్తా పోస్ట్‌కు 2000మంది అమ్మాయిలు స్పందించారు. అతని ప్రొఫైల్‌ను నిశితంగా పరిశీలించారు. వారి పరిశీలనలో అతనొక ఎంటర్‌ప్రెన్యూవర్ అని, ఆడి ఏ4 కారు ఉందని కనిపెట్టారు. ఈ స్థాయిలో స్పందన రావడంతో ఫిబ్రవరి 14న జరుపుకోవాల్సిన ప్రేమికుల రోజును వాయిదా వేశాడు. 2 వేల మంది అమ్మాయిల నుంచి ఐదుగురిని ఎంచుకునేందుకు అతనికి 5 రోజుల సమయం పట్టింది. ఆ విషయం అతనే ఫేస్‌బుక్‌లో రాశాడు. ఆ ఐదుగురితో కలిసి ఒబెరాయ్ హోటల్‌లో ఈ నెల 16న ప్రేమికుల రోజును జరుపుకున్నాడట. ఆ ఫొటోలతో పాటు భోజనాల బిల్లును కూడా పోస్ట్ చేశాడు. ఐదుగురికి వివిధ రకాల పన్నులతో కలిసి మొత్తం బిల్లు రూ.32438.97 పైసలు అయింది.