Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

Advertiesment
Two Wives one Man

సెల్వి

, మంగళవారం, 22 జులై 2025 (20:39 IST)
Two Wives one Man
గుజరాత్‌లో 36 ఏళ్ల వ్యక్తి ఒకేసారి ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరిని మూడేళ్ల వ్యవధిలో ప్రేమించాడు.. నిశ్చితార్థం చేసుకున్నాడు.. చివరికి ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లాడాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని వాన్స్‌డాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లా వాన్స్‌డా తాలూకాలోని ఖాన్‌పూర్ గ్రామానికి చెందిన మేఘరాజ్‌భాయ్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి వివాహ వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
కాజల్ గవిట్, రేఖాబెన్ గెయిన్‌లతో దేశ్‌ముఖ్ వివాహం మే 19న జరగాల్సి ఉంది. వారిద్దరితోనూ ఆయనకు చాలా కాలంగా సంబంధం ఉంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెప్పవచ్చు. దీంతో పెళ్లి కూడా ఇద్దరు మహిళలతో జరిగింది. ఈ ఏర్పాటు చాండ్ల విధి లేదా ఫుల్హార్ అనే పురాతన గిరిజన సంప్రదాయంలో జరిగింది. 
 
ఇదంతా ఒక వివాహ ఆహ్వానంతో ప్రారంభమైంది. ఇద్దరు వధువుల పక్కన ఒకే వరుడు ఉన్నట్లు స్థానికులు గమనించినప్పుడు, ఆ కార్డు వాట్సాప్, సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. వైరల్ వివాహంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ వ్యక్తి సెలెబ్రిటీగా మారిపోయాడు. 
 
మేఘరాజ్‌భాయ్ గిరిజన సమాజంలో, ఇటువంటి వివాహాలు సాంస్కృతికంగా అంగీకరించబడ్డాయి. మేఘరాజ్‌భాయ్ సంబంధం 2010లో ప్రారంభమైంది, అతను ఖండా గ్రామానికి చెందిన కాజల్ గవిత్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత, అతను 2013లో కేలియా గ్రామానికి చెందిన రేఖాబెన్ గెయిన్‌తో కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి ఇద్దరితో సహజీవనం మొదలెట్టాడు. తరువాత, వీరి పెళ్లి చంద్లా విధి అనే గిరిజన ఆచారం కింద జరిగింది. 
 
గ్రామంలోని ఆచారం ప్రకారం, అధికారికంగా వివాహం చేసుకునే ముందు జంటలు భార్యాభర్తలుగా జీవించడానికి అనుమతి ఉంది. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వారు సామాజిక, మతపరమైన ఆచారాల ద్వారా అధికారికంగా వివాహం చేసుకుంటారని అవగాహన ఉంది.
 
మేఘరాజ్‌భాయ్, అతని భాగస్వాములు ఈ మార్గాన్ని అనుసరించారు. వారు కలిసి ఒక కుటుంబాన్ని ఎంచుకున్నారు. కాజల్, రేఖకు ఇప్పటికే సంతానం వున్నారు. వీరి వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు