Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్‌లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం..

గుజరాత్‌లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం..
, మంగళవారం, 9 జులై 2019 (16:45 IST)
పబ్‌జీ.. దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ ఇది. ముక్కూమొహం తెలియకున్నా, ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతూ, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ శత్రువులను చంపే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంటుంది. గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఆడొచ్చు. 
 
యుద్ధంలా సాగే ఈ క్రీడలో గాయపడితే మెడికల్ కిట్‌లు, బంకర్ సదుపాయాలు ఉంటాయి. గెలిస్తే.. చికెన్ డిన్నర్లు కూడా ఉంటాయి. ఈ గేమ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ఆడుతున్నారు. రోజులో ఏ సమయంలో చూసినా మూడు, నాలుగు కోట్ల మంది ఈ గేమ్‌ ఆడుతుంటారు. 
 
ఈ గేమ్ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది. గేమ్ ఆడకపోతే పిచ్చోళ్లం అవుతామన్న రీతిలో దానికి బానిస అయిపోయారు. కొందరైతే గేమ్ ఆడొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరికొందరు ఎదుటివారిని చావబాదిన ఘటనలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ గేమ్ ఆడేవారిని ఉన్మాదిలా మార్చుతుందని చెప్పడంతో ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా మన దేశంలోని గుజరాత్ రాష్ట్రం ఈ గేమ్‌పై నిషేధం విధించింది.
 
తాజాగా, జోర్డాన్ దేశం కూడా పబ్‌పై నిషేధం విధించింది. ఈ గేమ్‌ వల్ల పిల్లలు, యువత ఎక్కువ ప్రభావితం అవుతున్నారని, వారు చెడు దారిలో వెళ్తున్నారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ గేమ్‌ను నిషేధిస్తున్నామని జోర్దాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గేమ్ వల్ల పిల్లలు, యువతలో హింసాత్మక ధోరణి పెరుగుతోందని, ఈ క్రమంలోనే ఈ గేమ్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఈ గేమ్‌ను ఎవరూ, ఎక్కడా ఆడకూడదని అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాక్, నేపాల్ ప్రభుత్వాలు కూడా ఈ గేమ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాలు కాపాడిన శవాలు... ఎలా?