Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుప్పట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని..?

దుప్పట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని..?
, సోమవారం, 15 మార్చి 2021 (15:56 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్‌లో ఘోరం జరిగింది. ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిన పాపానికి యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. భరత్ నగర్‌కి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఒక షాపు ముందు కూర్చొని మాట్లాడుతున్నారు.
 
దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఆమెను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం. 
 
మొదట అక్కడి వ్యక్తులు వారిద్దరిపై దాడి చేయడం మొదలుపెట్టారు.. ఆమెను అతడిని కిందపడేసి కొట్టడం మొదలుపెట్టారు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుండి తప్పించుకోగా.. ఆమె మాత్రం స్థానికుల చేతుల్లో దెబ్బలు తింది. రక్షించండి అంటూ ఆమె మొరపెట్టుకున్నా కూడా ఎవరూ రక్షించడానికి రాలేదు. దుపట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ప్రమాద ఘంటికలు.. 157 కరోనా కేసులు