Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాష్ లెస్ కు అలవాటుపడండి

క్యాష్ లెస్ కు అలవాటుపడండి
, సోమవారం, 23 మార్చి 2020 (22:04 IST)
కరోనా ను పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే కరెన్సీని కూడా అడ్డుకట్ట వేయాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు  కరోనా వ్యాప్తిలో భారతదేశం రెండవ ప్రమాద హెచ్చరికలో ఉంది కాబట్టి కేవలం విదేశీ ప్రయాణికులు స్వదేశీ ఆగమనం వలన కరోనా వైరస్ ఉధృతి పెరిగిపోతుంది వీరి వలన స్థానికులు కూడా కరోనా వైరస్ బాట పడుతున్నారు.

ఇలా స్థానికులకు కూడా కరోనా వ్యాప్తి చెందితే 3వ ప్రమాద హెచ్చరిక కు అంకురార్పణం చేసినట్టే.దీని వలన కరోనా సోకిన వ్యాధి గ్రస్తులు ఏమి ముట్టుకున్నా వైరస్ వ్యాపిస్తుంది. ఇటలీకి పట్టిన గతే భారతదేశానికి కుడా పడుతుంది అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఇటలీ చేసిన తప్పును మన భారతదేశం చేయకుండా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి పద్ధతులను తీసుకువచ్చి కరోనాను కొంత వరకు అడ్డుకట్టవేశారు.

దేశంలో పాజిటివ్ కేసులు రోజు వారి రేటు తగ్గుతుంది....అలాగే కరెన్సీ ని కూడా అడ్డుకట్టు వేసి క్యాష్ లెస్ సిస్టమ్ పూర్తి స్థాయిలో చేస్తే ఎటువంటి వైరస్ ప్రజల ఇంటికి దరిచేరదు.మనం చేతులను మాత్రమే శుభ్రంగా కడుకుంటాము కానీ బయట నుంచి వచ్చే కరెన్సీ ని అడ్డుకట్ట వేయలేము.

దీంతో కరోనా వ్యాధి గ్రస్తులు ముట్టుకున్న కరెన్సీ లావా దేవీల వలన కరోనా వ్యాప్తి వృద్ధి చెందుతుంది. దీనిని అరికట్టాలంటే కుటుంబం లో ఒకరైనా సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన ఉంటే దేశం మొత్తం వైరస్ వ్యాధి పడకుండా జాగ్రత్తలు వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సచివాలయ ఉద్యోగుల ఒక రోజు వేతనం