Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

Advertiesment
rk singh

ఠాగూర్

, శనివారం, 15 నవంబరు 2025 (17:24 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత బీజేపీ రెబెల్స్‌పై దృష్టిసారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌తో సహా మరో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు నేతలకు భాజపా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 
 
ఈ ముగ్గురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం వల్ల పలు భారతీయ జనతా పార్టీకి నష్టం వాటిల్లిందని.. పార్టీ దీనిని తీవ్రంగా పరిగణించిదని నోటీసులో పేర్కొంది. అందువల్లే శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.  
 
ఆర్కే సింగ్ గతంలో మాజీ దౌత్యవేత్తగా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో హోం కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు. 2013లో భాజపాలో చేరారు. 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు ఆరా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 
 
గత 2017లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ మంత్రిగానూ పని చేశారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీహార్‌లోని ఆరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయినప్పటి నుంచి ఆర్కే సింగ్‌ భాజపా, కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ బీహార్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై బీజేపీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్.బి.ఐ నుంచి ఎం-క్యాష్ సేవలు నిలిపివేత