Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ బీజేపీ నేతపై రేప్ కేసు.. రిసార్ట్‌కు పిలిచి మత్తుమందిచ్చి అత్యాచారం.. విక్టిమ్‌పై కూడా కేసు..?

బీజేపీ నేతలపై నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్‌లో నిండు గర్భిణీ మహిళ పొట్టపై కొట్టి.. గర్భస్థ శిశువు మరణానికి కారణమైనట్లు ఇప్పటికే బీజేపీకి చెందిన పంచాయతీ ప్రధాన్ పలాస్ కుమార్ బిస్వాస్‌పై ఆరో

Advertiesment
Delhi BJP MLA
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (17:15 IST)
బీజేపీ నేతలపై నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్‌లో నిండు గర్భిణీ మహిళ పొట్టపై కొట్టి.. గర్భస్థ శిశువు మరణానికి కారణమైనట్లు ఇప్పటికే బీజేపీకి చెందిన పంచాయతీ ప్రధాన్ పలాస్ కుమార్ బిస్వాస్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఢిల్లీకి చెందిన మరో బీజేపీ నేత.. మాజీ ఎమ్మెల్యే విజయ్ జోళీపై అత్యాచారం కేసు నమోదైంది.

రిసార్ట్‌కు పిలిచి.. తనకు మత్తుమందిచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డారని.. విజయ్ జోళీపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 376, 328, 506 కింద కేసు నమోదుచేశారు. 
 
ఫిబ్రవరి పదో తేదీన గుర్గాంలోని అప్నఘర్ రిసార్ట్‌కు తనను పిలిపించి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. బాధిత మహిళ చేస్తున్న ఆరోపణలను జోళీ కొట్టిపారేస్తున్నారు. తన రాజకీయ కెరీర్‌ను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా సదరు మహిళ తనకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, ఇవ్వని పక్షంలో తనపై రేప్ కేసు పెడతానని బెదిరించిందని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమ్మడి రాష్ట్రాల బంధం బలపడిందా! ఎవరివల్లో తెలుసా?