Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉమ్మడి రాష్ట్రాల బంధం బలపడిందా! ఎవరివల్లో తెలుసా?

రాష్ట్ర విభజనతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు వచ్చాయి. విమర్శలు పెరిగాయి. అది ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయి వరకూ వెళ్లాయి. కానీ ఇద్దరు చంద్రుల స్నేహం రెండు రాష్ట్రాల మధ్య కొత్త బంధాలు ఏర్పడటానికి, పాత అనురాగాలు మొలకెత్తాడానికి ఉపయోగపడ్డాయి. అయి

ఉమ్మడి రాష్ట్రాల బంధం బలపడిందా! ఎవరివల్లో తెలుసా?
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (17:02 IST)
రాష్ట్ర విభజనతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు వచ్చాయి. విమర్శలు పెరిగాయి. అది ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయి వరకూ వెళ్లాయి. కానీ ఇద్దరు చంద్రుల స్నేహం రెండు రాష్ట్రాల మధ్య కొత్త బంధాలు ఏర్పడటానికి, పాత అనురాగాలు మొలకెత్తాడానికి ఉపయోగపడ్డాయి. అయినా ఎన్నో వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అవన్నీ పరిష్కారం అవుతాయంటూ కేసీఆర్ తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పారు. ఇంతకీ కేసీఆర్ తిరుమల పర్యటన భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వామి వారికి చేయిస్తామన్న 5 కోట్ల విలువయిన సాలగ్రామాలు, కంఠాభరణం సమర్పించి మొక్కు తీర్చకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా తన ప్రభుత్వ యంత్రాగాన్ని కూడా స్వామి సన్నధికి తీసుకునివచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికింది. ఇవన్నీ చూస్తుంటే రెండు రాష్ట్రాల మధ్య బంధం బలపడిందని చెబుతున్నారు విశ్లేషకులు. 
 
రాష్ట్రం విడిపోయినప్పటికీ పట్టువిడుపుల మధ్య చాలా సమస్యలను పెండింగ్‌లోనే ఉన్నాయి. పంపకాలు ఇంకా పూర్తికాలేదు. అంతేకాకుండా నీటి పంపిణీ విషయంలో కొత్త సమస్యలు వచ్చాయి. కానీ స్వామివారి దర్శనం అయిన తరువాత కేసీఆర్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అన్ని త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక నుంచి సానుకూలంగా ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పనిచేద్దామంటూ సంకేతాలు ఇచ్చారు. దేవుడి సాక్షిగా అయినా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కారం అయితే అంతే చాలంటున్నారు ప్రజలు. మొత్తంమీద కేసీఆర్ తిరుమల పర్యటతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయని అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మా... మీరు రావచ్చు.. పురంధేశ్వరికి తలుపులు తెరిచిన జగన్.. ఎందుకు?