Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్కంఠను రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Advertiesment
ఉత్కంఠను రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
, ఆదివారం, 2 మే 2021 (09:11 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠతను రేపుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో హోరాహోరీగా సాగుతోంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లల్లో పోటీ తీవ్రంగా ఉంది. 
 
ముఖ్యంగా, ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. అధికార పార్టీ తృణముల్‌కు, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. టీఎంసీకి, బీజేపీ చెక్ పెడుతుందా..? లేక మళ్లీ టీఎంసీనే పాగా వేస్తుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీంతోపాటు అస్సాంలో బీజేపీ మళ్లీ విజయం సాధించి నిలుస్తుందా.. లేక కాంగ్రెస్ ధీటైన పార్టీగా పుంజుకుంటుందా అనేది కూడా తేలనుంది.
 
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం నాటికి ఫలితాలపై స్పష్టత రానుంది. కాగా.. కరోనా వ్యాప్తి కారణంగా కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
పశ్చిమ బెంగాల్‌లో 294 సీట్లు..
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే కరోనా కారణంగా ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఇక్కడ ప్రధానంగా అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోటీ నెలకొంది. ప్రస్తుత ట్రెండ్ మేరకు టీఎంసీ 86, బీజేపీ 82 చోట్ల ఆధిక్యంలో వుంది. 
 
అస్సాంలో 126 సీట్లు..
అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ట్రెండ్‌ను పరిశీలిస్తే బీజేపీ 30, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలోవుంది. 
 
తమిళనాడులో 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే వార్ నడిచింది. ప్రస్తుత ట్రెండ్స్ ‌మేరకు అన్నాడీఎంకే కూటమి 34 చోట్ల, డీఎంకే కూటమి 50 చోట్ల ఆధిక్యంలో వుంది. 
 
కేరళలో మొత్తం 114 సీట్లకు కాను ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎల్డీఎఫ్ కూటమి 63, యూడీఎఫ్ 48, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో వుంది. 
 
పుదుచ్చేరిలో 30 సీట్లకు గాను ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి 5 చోట్ల, కాంగ్రెస్ కూటమి 4 చోట్ల ఆధిక్యంలోవుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్ల లెక్కింపు : బెంగాల్‌లో దీదీ - తమిళనాడులో స్టాలిన్‌దే ఆధిక్యం