కన్నబిడ్డపై కన్నేసి.. భార్యలేనపుడు అత్యాచారం చేసిన తండ్రి అరెస్టు
కామాంధుడైన కన్నతండ్రి చేతిలో ఓ అబల తన శీలాన్ని కోల్పోయింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కామాంధుడైన కన్నతండ్రి చేతిలో ఓ అబల తన శీలాన్ని కోల్పోయింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఊత్తుకోట సమీపంలోని నత్తకోయిల్‌తిప్పై గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె ఎనిమిదో తరగతి చదువుతోంది. మద్యానికి బానిసైన ఇతను తప్పతాగి ఏడు నెలల కిందట ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్న కుమార్తెపై కన్నేశాడు.
అయితే, గురువారం కుమార్తె ఒక్కతే ఇంట్లో ఒంటిరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన ఆ కసాయి.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మిన్నకుండి పోయింది. ఫలితంగా ఆమె ఆరు నెలల గర్భంవతి అయింది. అయితే, రోజు రోజుకు కడుపు పెద్దదవడంతో ఇక దాచలేనని ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది.
వెంటనే ఆమె ఊత్తుకోట మహిళా పోలీసు స్టేషన్‌లకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి కామాంధుడైన తండ్రిని గురువారం అరెస్టుచేసి స్థానిక కోర్టులో హాజరుపరచి పుళల్ జైలుకు తరలించినట్లు సీఐ భద్రాదేవి పేర్కొన్నారు.