బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దారిలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కి చేరింది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.90తగ్గి రూ.47,130కి చేరింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజి వెండి ధర ఏకంగా రూ.1000 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.61,500కి చేరింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది.
బంగారం ఔన్స్‌కు 0.17శాతం పెరుగుదలతో 1908డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.47శాతం పెరుగుదలతో 24.53డాలర్లకు చేరింది.