Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటక పీసీసీ చీఫ్‌పై రమ్య కామెంట్స్.. నెట్టింట వైరల్

Advertiesment
ramya
, శనివారం, 14 మే 2022 (10:18 IST)
కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సొంత పార్టీ నేతపై రమ్య సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రమ్య చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు రమ్య గురువారం కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్ ,పార్టీ ప్రచార కమిటీ చీఫ్ ఎంబి పాటిల్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం జరుగుతోంది. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ను కప్పిపుచ్చడానికి కర్ణాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్‌తో "రహస్య సమావేశం" నిర్వహించారని పాటిల్ పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఆరోపణలు చేయడంతో వీరిద్ద మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
 
ఈ క్రమంలో వాటిపై స్పందించిన రమ్య .. శివకుమార్ పై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "పార్టీలకు అతీతంగా ప్రజలు ఒకరినొకరు కలుస్తారు, ఫంక్షన్‌లకు వెళతారు, కొందరు కుటుంబాల్లో పెళ్లి చేసుకుంటారు - నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శివకుమార్ గట్టి కాంగ్రెస్‌వాది అయిన పాటిల్ గురించి ఇలా అనడం. ఇలా అయితే ఎన్నికల్లో పార్టీ కలిసి పోరాటం చేయగలదా ? అంటూ రమ్య ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రమ్యను తప్పు పట్టారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరకొరియాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో రోగి మృతి.. కిమ్‌కు తలనొప్పి