Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేశ్వరస్వామి మహిమలు అందరికీ తెలుసు: సీజేఐ

Advertiesment
glories
, గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:14 IST)
"పూజలు సక్రమంగా జరగకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరు. ఆయన మహిమలు అందరికీ తెలుసు" అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరని ఆయన వ్యాఖ్యానించారు.

తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. విచారణలో సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసు విచారణ సమయంలో సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినని తెలిపారు.

అయితే అసలు పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ లాయర్‌కు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ నెల నుంచి అయినా పింఛన్ ఇస్తారా?: సాకే శైలజనాథ్