Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్న ఈసీ.. దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టాలని?: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారిపోయిందన్నారు. ఎందుకంటే ధృతర

ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్న ఈసీ.. దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టాలని?: అరవింద్ కేజ్రీవాల్
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:15 IST)
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారిపోయిందన్నారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఏం చేసైనా తన కుమారుడు దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టాలని చూశాడు. ప్రస్తుతం ఈసీ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
 
అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై 13 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఇదే అంశంపై విపక్ష నేతల బృందం వచ్చే బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 26న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అరవిందే కేజ్రీవాల్ ఈసీకి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ సీఎం ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడినట్టుగా అధికారులు గుర్తించారు. 
 
ఈ విషయమై విపక్షాలు అధికార బీజేపీపై విరుచుకుపడ్డాయి. తాను ఐఐటీ స్టూడెంట్‌నని.. 72 గంటల సమయాన్ని కేటాయిస్తే.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని నిరూపిస్తానని కేజ్రీవాల్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిండు నూరేళ్లు జగన్ జైలుపక్షి... కేశినేని నాని జోస్యం