నిండు నూరేళ్లు జగన్ జైలుపక్షి... కేశినేని నాని జోస్యం
కేశినేని ట్రావెల్స్ మూతవేసిన కేశినేని నానిని ఇప్పుడు మీడియా ఆయన ఎక్కడ కనబడితే అక్కడ ప్రశ్నలు సంధించేందుకు పోటీపడుతోంది. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. కేశినేని ట్రావెల్స్ మూతపెట్టడానికి గల కారణాల సంగతి అలా వుంచి, ప్రధాన ప్రతిపక్ష
కేశినేని ట్రావెల్స్ మూతవేసిన కేశినేని నానిని ఇప్పుడు మీడియా ఆయన ఎక్కడ కనబడితే అక్కడ ప్రశ్నలు సంధించేందుకు పోటీపడుతోంది. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. కేశినేని ట్రావెల్స్ మూతపెట్టడానికి గల కారణాల సంగతి అలా వుంచి, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పైకి వెళ్లింది. అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు కేశినేని స్పందించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన చెప్పే మాటల్లో వాస్తవం వుందా లేదా అన్నిది ప్రభుత్వం చెప్పాల్సి వుంటుందన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నో కేసులు వున్నాయనీ, అవన్నీ రుజువైతే కనీసం 100 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో చిన్న కేసుకే శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందనీ, అలాంటప్పుడు జగన్ మోహన్ రెడ్డికి వందేళ్ల శిక్ష పడకుండా ఎలా వుంటుందని ప్రశ్నించారు.