Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ..చిన్నారికి HIV+

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ..చిన్నారికి HIV+
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (20:19 IST)
మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందుకు హెచ్ఐవీ సోకింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర, అకోలా జిల్లా ముర్తిజాపుర్​ మండలంలోని హిర్​పుర్​కు చెందిన దంపతులకు 8 నెలల క్రితం పాప జన్మించింది. 
 
చిన్నారి జన్మించిన మూడు రోజుల తర్వాత చిన్న, చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. ముర్తిజాపుర్​లోని చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పలు రకాల మెడికల్ టెస్టులు చేసిన  డాక్టర్లు.. చిన్నారికి రక్తకణాలు తక్కువగా ఉన్నాయని.. వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు అకోలాలోని బీపీ ఠాక్రే బ్లడ్​బ్యాంకు నుంచి రక్తాన్ని తీసుకొచ్చారు. 
 
డాక్టర్లు ఆ రక్తాన్ని చిన్నారికి ఎక్కించారు. అయితే.. ఇటీవల చిన్నారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యపరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. చిన్నారికి హెచ్​ఐవీ పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. 
 
వెంటనే బాలిక తల్లిదండ్రులకూ పరీక్షలు నిర్వహించారు. అయితే వారిద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో చిన్నారికి హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారని నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రలో ఎన్నడూ లేనంత భీకర వర్షాలు.. న్యూయార్క్ పరిస్థితి విషమం