Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దినకరన్‌కు షాకిచ్చిన ఈసీ.. చిన్నమ్మే స్వయంగా సమాధానం చెప్పాలి..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై దాఖలైన వాదనను ఈసీ తిరస్కరించింది. ఈ వాదనను సమర్పించి

Advertiesment
దినకరన్‌కు షాకిచ్చిన ఈసీ.. చిన్నమ్మే స్వయంగా సమాధానం చెప్పాలి..
, శనివారం, 4 మార్చి 2017 (15:37 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై దాఖలైన వాదనను ఈసీ తిరస్కరించింది. ఈ వాదనను సమర్పించిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తమ వద్దనున్న ఆ పార్టీ ఆఫీస్ బేరర్ల జాబితాలో లేకపోవడమే తిరస్కరణకు కారణమని ఈసీ పేర్కొంది. 
 
ఈ వ్యవహారంలో శశికళ స్వయంగా సమాధానం చెప్పాలని కూడా ఈసీ వెల్లడించింది. అదీ ఈ నెల పదోతేదీ లోపు ఆ సమాధానం తమకు చేరాలని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ గత నెల 17న ఇచ్చిన నోటీసుకు శశికళ మేనల్లుడు దినకరన్ స్వయంగా సంతకం చేసి దాఖలు చేశారు. ఆయన్ని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా శశికళ కర్ణాటక జైలుకు వెళ్ళేముందు నియమించారు.
 
కానీ దినకరన్ పేరు ఆ పార్టీ ఆఫీస్ బేరర్ల జాబితాలో లేదనే విషయాన్ని ఈసీ ఎత్తిచూపింది. అంతేగాకుండా.. శశికళ స్వయంగా సంతకం చేసి లేదా ఆమె తరపున మరొకరిని అధికారం ఇచ్చి సమాధానం సమర్పించాల్సి వుంటుందని ఈసీ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకరు నూనె డబ్బాల వ్యాపారం... మరొకరు గాలిపటాలు చేస్తుంటాడు... ప్రధాని బంధువులు వీరే...