Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకరు నూనె డబ్బాల వ్యాపారం... మరొకరు గాలిపటాలు చేస్తుంటాడు... ప్రధాని బంధువులు వీరే...

దేశ ప్రధాని. అబ్బో.. దేశానికి ప్రధాని అయితే వారి కుటుంబ సభ్యులు రాజభోగాలు అనుభవిస్తుంటారు. ఇది అందరి భావన. ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఇదే భావన ప్రతి ఒక్కరిలోనూ పాతుకుపోయుంది. కానీ ప్రస్తుతం భారతదేశ ప్రధాని కుటుంబ సభ్యులు, ఆయన బంధువుల గురించి తె

Advertiesment
ఒకరు నూనె డబ్బాల వ్యాపారం... మరొకరు గాలిపటాలు చేస్తుంటాడు... ప్రధాని బంధువులు వీరే...
, శనివారం, 4 మార్చి 2017 (15:33 IST)
దేశ ప్రధాని. అబ్బో.. దేశానికి ప్రధాని అయితే వారి కుటుంబ సభ్యులు రాజభోగాలు అనుభవిస్తుంటారు. ఇది అందరి భావన. ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఇదే భావన ప్రతి ఒక్కరిలోనూ పాతుకుపోయుంది. కానీ ప్రస్తుతం భారతదేశ ప్రధాని కుటుంబ సభ్యులు, ఆయన బంధువుల గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఛాయ్‌వాలా ప్రధాని అంటూ బిజెపి నాయకులు గొప్పగా ఎప్పుడూ చెబుతుంటారు. ఆ ఛాయ్‌వాలా కుటుంబ సభ్యులు అదే స్థితిలో ప్రస్తుతం కొనసాగుతున్నారే తప్ప ప్రధానమంత్రి తమ వాడేనన్న విషయాన్ని వారు అసలు పట్టించుకోరంటే ఆశ్చర్యపోక తప్పదు. 
 
సోంభాయ్‌. మోదీ పెద్దన్నయ్య వయస్సు 75 సంవత్సరాలు. పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. అమృతాభాయ్‌ మోదీ రెండవ అన్నయ్య వయస్సు 72 సంవత్సరాలు. అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం నడుపుతున్నారు. 
 
జయంతిలాల్‌.. అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. అరవింద్‌భాయ్‌... ఒక బాబాయి కొడుకు నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలి పటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారుచేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు.
 
 
వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్ర మోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు. 
అధికార మదంతో వందల, వేల కోట్లు సంపాదించే వారికి మోడీ జీవితం ఆదర్శనీయం. ఆయన ఆదర్శాన్ని జీవిత మార్గంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతజాతి బాగుపడుతుంది. రాజకీయ సమాజంలో నాణ్యత పెరుగుతుంది. ఎప్పుడూ మోడీని విమర్శించే ప్రతిపక్షాలు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎందుకు విమర్శించరంటే అందుకు ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దటీజ్ ది గ్రేట్ నరేంద్ర మోదీ బ్యాక్‌గ్రౌండ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్‌ను చంపించింది జగనే... పిచ్చోడిలా జగన్ మోహన్ రెడ్డి... జేసీ సంచలన వ్యాఖ్యలు