Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరుగు తీయకముందే డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదం

ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటు

పరుగు తీయకముందే డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదం
, బుధవారం, 20 డిశెంబరు 2017 (09:27 IST)
ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. 
 
కాగా, ఈనెల 25వ తేదీన అంటే క్రిస్మస్ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆ రైలుకున్న బ్రేకులను పరీక్షించక ముందే పట్టాలెక్కించి నడుపడం వల్లే ప్రమాదం జరిగిందని అనధికారవర్గాలు తెలిపాయి. 
 
ఇది మానవ తప్పిదమని పేర్కొన్న ఢిల్లీ మెట్రో యాజమాన్యం, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనలో రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు