Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమృతకు అమ్మ డీఎన్ఎ ఎందుకు? శోభన్ బాబు డీఎన్ఏ చాలదా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అంటూ బెంగళూరుకు చెందిన అమృత చెప్తోంది. ఇంకా డీఎన్ఏ టెస్టుకు అమ్మ మృతదేహాన్ని వెలికితీయాలని అమృత డిమాండ్ చేస్తుంది. ఆపై అమ్మ మృతదేహానికి బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె కోరుతోంది.

అమృతకు అమ్మ డీఎన్ఎ ఎందుకు? శోభన్ బాబు డీఎన్ఏ చాలదా?
, సోమవారం, 18 డిశెంబరు 2017 (13:07 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అంటూ బెంగళూరుకు చెందిన అమృత చెప్తోంది. ఇంకా డీఎన్ఏ టెస్టుకు అమ్మ మృతదేహాన్ని వెలికితీయాలని అమృత డిమాండ్ చేస్తుంది. ఆపై అమ్మ మృతదేహానికి బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె కోరుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో అమృత వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే కర్ణాటక హైకోర్టులో తేల్చుకోమని సుప్రీం ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో అమృత హైకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అమృత జయలలిత కుమార్తె అని నిరూపించేందుకు సోగ్గాడు శోభన్ బాబు డీఎన్ఏ చాలునని.. జయలలితకు చికిత్స అందించిన ఆక్యుపంచర్ వైద్యుడు శంకర్ తెలిపారు. అమృత జయలలిత కుమార్తె అని తేలిపోవాలంటే డీఎన్ఏ టెస్టు చేయించాలని జయలలిత బంధువు లలిత కూడా డిమాండ్ చేసింది. జయలలితకు కుమార్తె వుందని.. ఆమె అమృత అయివుండవచ్చునని లలిత అనుమానం వ్యక్తం చేసింది. ఈ అనుమానాలు తొలగిపోవాలంటే.. డీఎన్ఏ టెస్టు చేయించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి తరుణంలో అమృత ఎవరో తేలాలంటే.. శోభన్ బాబు డీఎన్ఏ సరిపోతుందన్నారు..శంకర్. 
 
జయలలిత మృతిపై నియమాకమైన ఆరుముగ స్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు శంకర్ హాజరయ్యారు. ఆపై మీడియాతో మాట్లాడిన శంకర్.. జయకు స్టెరాయిడ్లు ఎక్కువ ఇవ్వడంతో ఆమె మరణించారన్నారు. 2016 ఎన్నికల సందర్భంగా జయలలితకు చికిత్స అందించానని, అయితే అపోలోలో చేరిన తర్వాత అమ్మను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కుదరలేదని శంకర్ తెలిపారు. 
 
అమృత వ్యవహారంపై స్పందిస్తూ.. జయలలిత - శోభన్ బాబు సంతానం అయినట్లైతే శోభన్ బాబు కుమారుడి డీఎన్ఏ ఆధారంగా అమృతను ఎవరో కనిపెట్టేయనచ్చునని వెల్లడించారు. ఇంకా జయలలిత డీఎన్ఎ రిపోర్ట్ అపోలో ఆస్పత్రిలో కచ్చితంగా వుంటుంది. ఆ రిపోర్ట్‌ను అమృత న్యాయస్థానం ఆదేశాల మేరకు పొందవచ్చునని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు