Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రీ వెడ్డింగ్ షూట్.. కాబోయే భార్యతో కలిసి రోగికి ఆపరేషన్ చేస్తున్నట్టుగా...

pre wedding shoot

ఠాగూర్

, శనివారం, 10 ఫిబ్రవరి 2024 (10:44 IST)
ఇటీవలికాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో పిచ్చి పనులు చేస్తున్నారు. పిచ్చి ముదిరి పాకానపడటం అంటే బహుశా ఇదేనేమో... ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో తనకు కాబోయే భార్యతో ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లో రోగికి ఆపరేష్ చేస్తున్నట్టు ఫోటో షూట్... వీడియోను తీశాడు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో ఆస్పత్రిలో పని చేసే వైద్యుడిపై సస్పెండ్ వేటుపడింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని భరంసాగర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో ఓ వైద్యుడు పని చేస్తున్నాడు. ఈయన తనకు కాబోయే భార్యతో కలిసి ఓ రోగికి ఆపరేష్ చేస్తున్నట్టుగా ఫోటోలు, వీడియోల తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు ఎక్కడంతో వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 
 
ఈ విషయం కాస్త రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దినేశ్ గుండూరావ్ దృష్టికి చేరింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించి, ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఆపరేషన్ థియేటర్‌ను వేదికగా చేసుకున్న కాంట్రాక్టు వైద్యుడిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, ఈ సస్పెండ్ వేటు తక్షణం అమల్లోకి వస్తుందని ఎక్స్‌లో వెల్లడించారు. 
 
ఆస్పత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికే కానీ, ఇలా ప్రీవెడ్డింగ్ షూట్‌లకు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేంది లేదని హెచ్చరించారు. సామాన్యుల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తుందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధి నిర్వహణపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు. 
 
కాగా, ఈ ఘటనపై చిత్రదుర్గ జిల్లా ఆరోగ్యాధికారి రేణుప్రసాద్ మాట్లాడుతూ.. వైద్యుడిని నెల రోజుల క్రితమే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అపాయింట్ చేసుకున్నట్టు చెప్పారు. అతడు ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్న ఆపరేషన్ థియేటర్ను మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ నుంచి ఉపయోగించడం లేదని వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల అభ్యర్థుల సంగతేంటి..? అయోమయంలో పార్టీలు