Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ మన ఇంటిలోకి రాకుండా ఇలా చేయండి

కోవిడ్ మన ఇంటిలోకి రాకుండా ఇలా చేయండి
, సోమవారం, 20 జులై 2020 (08:21 IST)
తగిన రక్షణ చర్యలు చేపట్టి మీ ఇంటిని  కోవిడ్ దుర్బెధ్యంగా మార్చండి. ఈ కింది సూచనలు పాటించడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా మరియు మనకు మన ప్రియమైన వారికి  రాకుండా కొద్దిగా ఆపగలి గే ప్రయత్నం చేయవచ్చు!
 
1. రోజు ఉదయాన్నే మీ ఇంటి డాబా మీద  లేదా  ఇంటి  బయట ఎండలో 20 ని. సేపు శ్వాస వ్యాయామాలు మరియు యోగ తప్పనిసరిగా  చేయండి. రోజుకు రెండుసార్లు పసుపు నీటితో ఆవిరిపట్టండి గోరువెచ్చని ఉప్పు  నీటితో గార్గ్లింగ్ చేయడం ఉత్తమం.
 
2. ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి...అది ప్రతి అర గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా చాలా సార్లు 5 లీటర్ల వరకు త్రాగండి...
 
3. ఆయుర్వేదం లో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగాలు, మిరియాలు మొదలైనవి నీటిలో బాగా మరిగించి రెండు, మూడు పూటలా తాగాలి.
 
4. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాల లో చిటికెడు పసుపును కలుపుకుని తాగండి.
 
5. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళే మనకు విలువైన ఆస్తి. వారికి  వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి  తేలికగా    కోవిడ్ బాదిన పడే అవకాశాలు ఎక్కువ కనుక ఇంట్లో మరిన్ని  జాగ్రత్తలు తప్పనిసరి చేయండి మరియు పాటించండి.
 
6. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి బలమైన ఆహారం అయిన కోడిగుడ్డు, పాలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ ఎక్కువుగా తినండి. మరియు రాగి జావా అంబలి చేసుకోని తాగండి.
 
7. బి‌పి, షుగర్ వంటి అత్యవసరమైన మందులు తో పాటు ఇంట్లో తప్పనిసరిగా 1. పారాసెటమాల్, 2.సిట్రేజిన్, 3.దగ్గు మందు,  4.మౌత్ వాష్ మరియు గార్గిల్  కోసం బీటాడిన్, 5.విటమిన్ సి మరియు డి 3, 6.బి కాంప్లెక్స్  జిన్కోవిట్, 7. ఆవిరి కోసం జండూ బామ్ మరియు  పసుపు ఉంచుకోండి.
 
8.  ఆఫీసులు, ఉద్యోగ ప్రాంతం, రద్దీ ప్రాంతాల్లో నుండి ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే మీ మొబైల్, తాళాలు, పర్సులను శానిటైజర్ తో శుభ్రము చేసి, బట్టలను బయటే విడచి డెట్టాల్ కలిపిన నీళ్ళలో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి మాత్రమే ఇంట్లోకి వెళ్ళండి.
 
9. బయట నుండి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువులను తప్పనిసరిగా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.
 
10. ఒకవేళ బయటికి వెళ్ళితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, తరచుగా శానిటైజర్ ని చేతులకు రాసుకుని దగ్గర పెట్టుకోండి.
 
11. బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును, నోటిని, కళ్లను చేతులతో తాకరాదు.
 
12. ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి.
 
13. రోగనిరోధక శక్తి ని పెంచే సీ విటమిన్ ఎక్కువుగా గల పండ్లు నిమ్మ, జామ, ఉసిరి తో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజ మొదలైనవి తరచుగా తీసుకోవాలి.
 
14. రోజు రాత్రి సమయం లో నీళ్లలో బిటడిన్ ద్రావణం కలిపి నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళే లాగా పుక్కిలించి గార్గిల్ చేయాలి.
 
15. ప్రతి రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోండి.
 
16. ఈ పరిస్థితుల్లో మద్యపానం జోలికి వెళ్ళక పోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
 
మీరు కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి.......?
 1. గొంతు దురద
 2. పొడి గొంతు
 3. పొడి దగ్గు
 4. అధిక ఉష్ణోగ్రత
 5. శ్వాస ఆడకపోవడం
 6. వాసన కోల్పోవడం

పై లక్షణాలు ఎక్కువైనా శ్వాస లో ఇబ్బందులు తలెత్తినా  తక్షణమే వైద్యుల సహాయం  తీసుకోండి. జాగ్రత్తగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండండి!  లేకుంటే ఐసీయూలో ఐసోలేషన్ ఉండాల్సి ఉంటుంది!!
 
జిన్కోవిట్
 
జిన్కోవిట్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటెల గారూ... డౌట్ వస్తదని బులిటినే చేంజ్ చేసేసారు గ్రేట్ సర్, ఎవరు?