Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : డీఎంకే ఎంపీ

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : డీఎంకే ఎంపీ
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (16:38 IST)
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభలో డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు రూపొందించలేదు? తమిళనాడులో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 5 నెలలకు పైగా గవర్నర్ నీట్ ఎన్నికల నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్రపతికి బిల్లు పంపకుండా కేంద్రం తొక్కిపట్టిందని ఆయన ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

PRCకి వ్యతిరేకంగా ఉద్యోగుల 'చలో విజయవాడ': వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన