Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబర్ 12న రాత్రి గం.9 డిస్కవరీ చానెల్లో.... కేరళ వరదలు-ఒక మానవత దృక్పథంలోని విజయగాథ

Advertiesment
Kerala Floods-The Human Story
, శుక్రవారం, 9 నవంబరు 2018 (21:22 IST)
హైదరాబాద్: `కేరళ ఫ్లడ్స్- ది హ్యూమన్ స్టోరీ` పేరుతో రూపొందించిన గంట నిడివి గల ప్రత్యేక డాక్యుమెంటరీ ఇటీవల సంభవించిన భీతావహ వరదల సమయంలో కేరళీయులు విశ్వాసం కోల్పోయిన స్థితి, ప్రస్తుతం వారు తమ రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుంటున్నవిధానం ఈ క్రమంలో వారు చూపుతున్న స్ఫూర్తిని డిస్కవరీ చానెల్ ద్వారా చాటిచెప్పనుంది. విపత్తు సమయంలో స్థానికులు చూపించిన ధీరోదాత్తతను విజయగాథ రూపంలో ఈ డాక్యుమెంటరీ చాటి చెప్పనుంది. 
 
విపత్తు సమయంలో ఆపదలోని ప్రజలను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్పందించిన వారి గురించిన విశిష్ట గాథలను సైతం ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. రెస్క్యూ ఆపరేటర్లుగా మారిన మత్య్సకారులు, ఈ క్రమంలో డిఫెన్స్ సిబ్బందికి అందించిన సహాయ సహకారాలు, స్వచ్ఛంద సేవాసంస్థలతో కలిసి సేవలు అందించిన సినీ నటులు, యువ ఔత్సాహికులైన వ్యాపారవేత్తలు, ఇలా వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున విరుచుకుపడిన వరదల సమయంలో స్థానికులకు సహాయసహకారాలు అందించిన వారందరినీ ఇందులో పొందుపర్చనున్నారు. 
 
ఈ డాక్యుమెంటరీలో సజితాజబిల్ యొక్క విజయగాథను సైతం పొందుపర్చారు. తన ప్రసూతికి కేవలం మూడు రోజుల సమయం ముందే ఓ వైపు ముంచెత్తుతున్న వరద ప్రవాహంతో పెరిగిపోతున్న నీటిమట్టం, మరోవైపు సమీపిస్తున్న నొప్పులతో ఆమె పడ్డ ఆవేదనను ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియన్ నేవీ అత్యంత నాటకీయ పద్దతిలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్, తద్వారా  ప్రతిష్టాత్మకంగా నేవీ చరిత్రలో నిలిచిపోయిన తీరును ఇందులో ఉదహరించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆమెకు జన్మించిన చిన్నారి సుభాన్‌కు తన జన్మకు ముందు సంభవించిన ఘటనలు, తనకు జన్మను అందించిన తల్లి అనుభవించిన కష్టాల గురించి ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. గంట నిడివి గల ఈ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ నవంబర్ 12, 2018న రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానెల్లో మాత్రమే ప్రసారం కానుంది.
webdunia
 
ఈ విపత్తు పరిణామాలన్నీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు చోటుచేసుకున్నాయి. ఆగస్టు పదిహేనవ తేదీన కుండపోతగా కురుస్తున్న వానకు కేరళ తడిసి ముద్దయిపోయింది. కేరళ వాసులు గత వందేళ్ల కాలంలో ఎన్నడూ చవిచూడని భీకర వర్షపాతాన్ని తాము అనుభవించబోనున్నామని స్వల్ప కాలంలోనే స్థానికులు గుర్తించారు. 11 రోజుల పాటు వరుసగా నిరంతరాయంగా కురిసిన కుండపోత వర్షం వల్ల కేరళలో దాదాపు 25 ట్రిలియన్ల లీటర్ల నీరు కేరళను ముంచెత్తింది. 

అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్న కేరళ రాష్ట్రంలో 44 నదులు, 61 డ్యాంలు ఉన్నాయి. కేరళ ఉన్న భౌగోళిక పరిసరాలనే కాకుండా ఏ ప్రాంతానికి చెందిన చారిత్రక మరియు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నీరు అనేది అత్యంత ముఖ్యమనే సంగతి తెలిసిందే. నీరు సమృద్దిగా ఉండటం అనేది జీవితాన్ని సాఫీగా సాగించేందుకు మరియు సక్రమంగా వారి వారి పనులను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. 
webdunia
 
అయితే, కేరళను ముంచెత్తిన వరద దాదాపుగా గత వందేళ్ల కాలంలో ఏనాడు చోటుచేసుకోలేదు. గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరున్న కేరళలో 218 బ్రిడ్జీలు, 35,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు, 1,74,000కు పైగా నివాసాలను పునర్నిర్మించాల్సి ఉంది. దాదాపు 46,000కు పైగా హెక్టార్లలోని వ్యవవసాయ పంటలు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని రూ.40,000 కోట్లుగా అంచనా వేశారు. ఈ డాక్యుమెంటరీ యొక్క ప్రాముఖ్యతను గురించి డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రీమియం&డిజిటల్ నెట్వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ జుల్పియా వారిస్ మాట్లాడుతూ ``కేరళ ఈ సంవత్సరం ఎదుర్కొన్న వరదలు గతంలో మునుపెన్నడూ లేనటువంటివి. వార్తల పరంగా చూసుకుంటే ఇది అత్యంత ప్రాధాన్యమైనది. గతం నాటి వార్తలు సహజంగా నేడు అప్రధాన్యమైనవి. 
 
`కేరళ ఫ్లడ్స్- ది హ్యూమన్ స్టోరీ` పేరుతో ఈ డాక్యుమెంటరీ రూపకల్పన వెనుక ప్రధాన ఉద్దేశం కేరళను పునర్ నిర్మించేందుకు శ్రమిస్తున్న వందలాది మంది యొక్క  కృషిని చాటిచెప్పడం. విపత్తు సమయంలో పలువురు చూపించిన ధైర్యసాహసాలు, స్థానికులకు అందించిన సహాయ సహకారాలు, వారి ధీరత్వం వంటి వాటిని గురించి స్పష్టంగా తెలియజెప్తూ...విపత్తు వల్ల కేరళ సర్వనాశనం కాలేదని తిరిగి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు శ్రమిస్తోందని స్పష్టం చేయనుంది. కేరళ తీవ్రంగా దెబ్బతినిపోవడాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించారు. అయితే, ప్రస్తుతం కేరళను తిరిగి నిర్మిస్తున్న వారి ప్రయత్నాలను వీక్షించేందుకు, ఆ ప్రయత్నంలోని ఘట్టాలను తెలియజెప్పేందుకు ఈ డాక్యుమెంటరీ ప్రత్యక్ష సాక్షంగా ఉంటుంది`` అని వివరించారు.
 
కేరళ వరదలపై రూపొందించిన గంట నిడివి గల ఈ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ నవంబర్ 12, 2018న రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా కేరళను తిరిగి కోలుకునేలా చేసుకునే క్రమంలో జరుగుతున్న ప్రయత్నాలు, పునర్ నిర్మించేందుకు జరుగుతున్న సహాయక చర్యల గురించి తెలియజెప్పనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఇక నుంచి అమ్మవారి చెంత కడుపు నిండా భోజనం..!