2015లో పెళ్లి... భర్తతో 45 రోజులే కలిసుంది... అతడిని రప్పించండి...
మనుషులు ఇలా ఎందుకు వుంటారో ఒక పట్టాన అర్థం కాదు. పెళ్లి చేసుకుని కొందరు తమ భార్యలను వదిలేసి విదేశాల్లో కాలం గడుపుతారు. అదేమని అడిగితే సరైన ఆన్సర్ దొరకదు. ఇక వాడి బుద్ధి పక్కదోవ పడితే ఇక చెప్పేదేముంది. పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు అన్నీ కష్టాలే. ఇలాంటి
మనుషులు ఇలా ఎందుకు వుంటారో ఒక పట్టాన అర్థం కాదు. పెళ్లి చేసుకుని కొందరు తమ భార్యలను వదిలేసి విదేశాల్లో కాలం గడుపుతారు. అదేమని అడిగితే సరైన ఆన్సర్ దొరకదు. ఇక వాడి బుద్ధి పక్కదోవ పడితే ఇక చెప్పేదేముంది. పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు అన్నీ కష్టాలే. ఇలాంటి కష్టాలను పడుతున్న ఓ పంజాబీ అమ్మాయి తన భర్తను కఠినంగా శిక్షించాలంటూ నేరుగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ను అభ్యర్థించారు. తనను వదిలేసి న్యూజీలాండ్ దేశంలోనే వుంటున్న అతడిని భారతదేశానికి రప్పించి మరో మగాడు ఇలా చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతోంది.
సామాజిక నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తన బాధను ఆమె వెల్లడించారు. తన భర్త రమణ్ దీప్ నేరాలు చేయడంలో ఆరితేరిపోయాడని పంజాబ్ పోలీసు రికార్డుల్లోనే వుందనీ, అలాంటి వాడిని వదిలేయకుండా శిక్షించాలని ఆమె కోరారు. 29 ఏళ్ల చాంద్ దీప్ 2015 జూలై నెలలో అతడిని వివాహం చేసుకున్నట్లు తెలిపింది. అక్కడ నుంచి అతడు కొన్ని రోజులు ఇక్కడ వుంటూ మిగిలిన రోజులన్నీ న్యూజిలాండులో వుంటూ వచ్చాడని పేర్కొంది. ఇన్నేళ్లలో తను అతడితో కేవలం 45 రోజులు మాత్రమే కలిసి వున్నాననీ, అతడిని ఇండియాకు రప్పించి విడాకులు ఇప్పిస్తే కొత్త జీవితం మొదలుపెడతానని తెలియజేసింది.
ఇప్పటికే తన అభ్యర్థన మేరకు అతడికి చెందిన పత్రాలను విదేశీ మంత్రిత్వ శాఖ పంపించాల్సిందిగా కోరిందనీ, అతడిని ఎలాగైనా రప్పించి, అలా ప్రవర్తించే మగాళ్లకు బుద్ధి వచ్చేలా శిక్ష విధించాలని ఆమె కోరుతోంది. భర్త పరిస్థితి ఇలావుంటే తన అత్తమామలు కూడా తనపై దారుణంగా ప్రవర్తిస్తున్నారనీ, తమ కుమారుడిని తాము వదిలేశామనీ, కనుక నన్ను అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లి బతకాల్సిందిగా చెపుతున్నారని వెల్లడించింది. ఈమధ్య తను తరచూ ఫోన్లు చేస్తున్నానని వారి ఫోన్లో తన నెంబరును బ్లాక్ చేసేశారని ఆవేదన వ్యక్తం చేసింది.