పాకిస్థాన్ రె ''ఢీ''.. ఎదురుదాడికి సైన్యం సిద్ధంగా ఉంది: నవాజ్ షరీఫ్ సవాల్
భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌లో ఉరిశిక్ష విధించడంపై పార్లమెంట్‌లో ఎంపీలంతా నిరసన గళం విప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర హోం మంత్ర
భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌లో ఉరిశిక్ష విధించడంపై పార్లమెంట్‌లో ఎంపీలంతా నిరసన గళం విప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కుల్‌భూషణ్ జాదవ్‌ను రక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ ఇచ్చిన హెచ్చరికలపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్పందించారు. భారత్‌తో ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
వైమానిక దళ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... పాకిస్థాన్ శాంతిని కోరే దేశమని పేర్కొన్నారు. దీనిని ఏ దేశమైనా బలహీనంగా తీసుకోవద్దన్నారు. అనుమానాలను తావు లేకుండా సమస్యకు పరిష్కారం ఇవ్వడమే పాకిస్థాన్ లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఇతర దేశాలతో కలుపుకోలుగా వ్యవహరించడంతో పాటు తమ దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడాల్సిన హక్కు ఉందని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.
ఇతర దేశాలతో స్నేహహస్తం ఇచ్చేందుకు పాకిస్థాన్ ఎప్పటికీ ముందుంటుంది.. అదేవిధంగా హెచ్చరికలను కూడా ధీటుగా ఎదుర్కొంటుందని నవాజ్ తెలిపారు. హెచ్చరికలను ఎదుర్కొనేందుకు, సరైన విధంగా ఎదురుదాడి చేసేందుకు పాకిస్థాన్ సైన్యం సిద్ధంగా ఉందని నవాజ్ షరీఫ్ చెప్పారు. నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే భారత్‌తో యుద్ధానికైనా పాక్ సిద్ధమన్నట్లున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.